రూపు మారనున్న ఇంద్రకీలాద్రి

రూ. 216 కోట్లతో దుర్గమ్మ దేవస్థానం అభివృద్ధికి భూమి పూజ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌


రూపు మారనున్న ఇంద్రకీలాద్రి
x
దుర్గమ్మ చిత్రపటాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అందిస్తున్న పండితులు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారు. మొత్తం రూ. 216 కోట్ల విలువైన అభివృద్ది కార్యక్రమాలు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో చేపడతారు.

భూమి పూజ అనంతరం ముఖ్యమంత్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని సందర్శించుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రి జగన్‌కు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందించిన దేవస్థానం అధికారులు, వేద పండితులు అందించారు. కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్టు, ఎమ్మెల్సీ మహమ్మద్‌ రుహుల్లా, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఉన్నతాధికారు పాల్గొన్నారు.Next Story