మ్యాచ్ నుంచి తప్పుకున్న మాక్స్ వెల్, ఎందుకంటే..
ఈ ఐపీఎల్ సీజన్ లో తన స్థాయి తగ్గ ఆట ఆడలేకపోతున్న గ్లెన్ మాక్స్ వెల్.. తాజాగా ఆట నుంచి కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్ లో తన స్థాయికి తగ్గ ఆట ఆడలేకపోతున్న గ్లెన్ మాక్స్ వెల్.. తాజాగా ఆట నుంచి కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన సరిగా ఆటలేకపోవడం, మానసికంగా, శారీరకంగా అలసిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తన బ్యాటింగ్ ఫామ్ పై ఆందోళన చెంది ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరులో సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌కు మాక్స్‌వెల్ గైర్హాజరు అయ్యారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేతి వేలికి గాయం కావడమే కారణమని మొదట టీమ్ మేనేజ్ మెంట్ చెప్పినా అది తప్పని తాజాగా తేలింది.
"ఇది చాలా తేలికైన నిర్ణయం. ముంబైతో మ్యాచ్ అనంతరం కెప్టెన్ ఫాఫ్, కోచ్‌ల వద్దకు వెళ్లాను నా స్థానంలో వేరే ఆటగాడిని ప్రయత్నించే సమయం వచ్చిందని చెప్పాను" అని మ్యాక్స్‌వెల్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్‌లో చెప్పాడు.
"నేను మానసికంగా, శారీరకంగా కొంత విశ్రాంతి తీసుకోవడానికి, నా శరీరాన్ని సరిదిద్దుకోవడానికి సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. బహుశా నేను టోర్నమెంట్‌లో పాల్గొనవలసి వస్తే, దృఢమైన మానసిక, శారీరక ధృక్పథంతోనే తిరిగి రావాలనుకుంటున్నాను.అప్పుడు మాత్రమే నేను బాగా ఆడగలను" అని అన్నారాయన.
ఇదే మొదటి సారి కాదు..
మ్యాక్స్‌వెల్ తన కెరీర్‌లో ఇలా విరామం తీసుకోవడం రెండో సారి. ఇంతకుముందు కూడా 2019 లో ఒకసారి కూడా విరామం తీసుకుని వచ్చాడు. ఆ సమయంలో తాను మానసికంగా, శారీరకంగా బ్యాలెన్స్ కోల్పోయా అని పేర్కొన్నాడు. ఇప్పుడు తన వయస్సు 35.. బహూశా తీవ్ర ఆటతీరు వల్ల అతను అలసి పోయి ఉంటాడరి క్రీడా పండితులు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న IPLలో, మ్యాక్స్‌వెల్ ఆడిన ఆరు మ్యాచ్‌లలో బ్యాట్, బాల్ రెండింటితో విఫలమయ్యాడు. 5.33 సగటుతో, 94 స్ట్రైక్-రేట్‌తో కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఇరవై ఎనిమిది కోల్‌కతా నైట్ రైడర్స్‌పై వచ్చాయి. ఈ మ్యాచ్ లో కూడా రెండుసార్లు మాక్స్ వెల్ కు జీవదానం లభించింది. "నేను బ్యాట్‌తో సరిగా ఆడట్లేదని అనిపించింది, నా స్థానంలో ఎవరికైన అవకాశం బాగుంటుందని అనిపిస్తోందని మాక్స్‌వెల్ అన్నాడు.
తిరిగి వస్తాడు..
ఇక్కడ మేనేజ్ మెంట్ అద్భుతంగా ఉంది. కానీ నేను బాగాలేదు. ఇలా మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు సంతోషంగా ఉండదు. ఇలాగే మ్యాచ్ లు ఆడాలని నేను కోరుకోనని మాక్స్ వెల్ అంటున్నారు. బాగా తిరిగి గేమ్ ను ఆస్వాదిస్తానని అన్నారు.
ఐపీఎల్‌కు ముందు అతను సాధించిన పరుగులను పరిగణనలోకి తీసుకుంటే అతని ఫామ్‌లో ఆకస్మిక తగ్గుదల కనిపించింది. మాక్స్‌వెల్ నవంబర్ నుంచి 17 తరువాత జరిగిన T20 నుంచి 552 పరుగులు సాధించాడు, ఇందులో మాక్స్ వెల్ స్ట్రైక్-రేట్ 185, సగటు 42గా ఉంది. కానీ ఐపీఎల్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు.
మాక్స్‌వెల్ ఐపీఎల్ 2020లో పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితే అనుభవించారు. ఆ సీజన్‌లో, ఆస్ట్రేలియన్ 11 మ్యాచ్‌లలో కేవలం 108 పరుగులు చేశాడు అందులో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. ఈ సీజన్ లో కూడా మాక్స్ వెల్ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటుడంతో ఐపీఎల్ గేమ్ ల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారు.
Next Story