ఐపీఎల్2024 : వాంఖడే  వార్ లో విజేతలెవరో?
x
ఎంఎస్ ధోని

ఐపీఎల్2024 : వాంఖడే వార్ లో విజేతలెవరో?

ఐపీఎల్ లో ఆదివారం ఢిపెండింగ్ ఛాంపియన్ చెన్నై, మాజీ ఛాంపియన్ ముంబై మధ్య పోరు జరగనుంది. ధోనికి వాంఖడేలో ఇదే చివరి మ్యాచ్ కావడంతో ముంబై ఫ్యాన్స్ ధోని బ్యాటింగ్ ..


ఆదివారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ తో మ్యాచ్ ను వీక్షిస్తారనడంలో సందేహం లేదు. ఇక్కడ రెండు జట్లకు కొత్త కెప్టెన్లు ఉన్నారు. 2011 లో ఇదే స్టేడియం వేదికగా వన్డే వరల్డ్ కప్ అందుకున్న మహేంద్ర సింగ్ ధోనికి వాంఖడేలో ఇదే చివరి మ్యాచ్ కావచ్చు.

ధోని పునరాగమనం
ధోని తన చివరి IPL సీజన్‌లో నాన్ కెప్టెన్ గా మొదటి సారిగా వాంఖడే స్టేడియంలో ఆడనున్నారు. ఐపీఎల్ ప్రారంభమైన తరువాత 42 ఏళ్ళ వయసులో కూడా, ధోని వికెట్ల వెనక ఇంత చురుగ్గా ఉన్నాడు. అతని ఆటలో కూడా ఎలాంటి మార్పులేదు. కానీ రెండు పరాజయాల తరువాత ధోని వ్యూహచతురతే తిరిగి సీఎస్కేను పోటీలోకి నిలుపుతోందని క్రీడాపండితులు భావిస్తున్నారు.
MI కంటే CSK ఇటీవలి రికార్డు
ఇటీవల జరిగిన ఐదు మ్యాచుల్లో సీఎస్కే నాలుగు విజయాలు సాధించి జోరుమీదుంది. అంతకుముందు సీజన్ లో కూడా ముంబైపై ఏడు వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించడం దాని ఆత్మవిశ్వాసం పెంచే విషయమే.
ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన రెండు జట్లు. ఒక్కొక్కటి ఐదు టైటిల్స్‌తో సమ ఉజ్జీవులుగా ఉన్నాయి. MIలో రోహిత్ శర్మ నుంచి పాండ్యా కెప్టెన్ గా పగ్గాలు చేపట్టడం, CSKలో ధోనీ తర్వాత గైక్వాడ్ రావడంతో కొత్త కెప్టెన్లలో ఎవరిదో పై చేయో అవుతుందో అన్న ఆసక్తి సైతం ఉంది.
వాంఖడే పిచ్ ప్లాట్ గా ఉంటుంది. ఇక్కడ పరుగుల వరద పారడం గ్యారెంటీ అని గత రికార్డులు చూస్తే తెలుస్తుంది. ఇక్కడి రాత్రి పూట మంచు కారణంగా టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే బెంగళూర్ పై జరిగిన మ్యాచ్ లో ముంబై బ్యాట్స్ మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కేవలం 15 ఓవర్లలో దాదాపు రెండువందల పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేశారు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ పై 230 పరుగులు సాధించారు.
హార్దిక పాండ్యా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాక జట్టు మొదట కొన్ని తప్పటడుగులు వేసింది. తరువాత లోపాలు సరిదిద్ది తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపారు. గత రెండు మ్యాచ్ లలో బాగా ఆడారు RCBతో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 17 బంతుల్లో అర్ధశతకం సాధించి, CSK బౌలర్‌లకు తాను జట్టులో ఉన్నాననే హెచ్చరికల పంపాడు. ఇషాన్ కిషన్, రోహిత్ ఓపెనింగ్ స్టాండ్ స్కీమ్ ఆఫ్ స్కీమ్‌లో కీలకం అయితే CSK కూడా అంతే ధీటైన లైనప్ ను కలిగి ఉంది.
కెప్టెన్ గైక్వాడ్ బ్యాట్‌తో విధ్వంసం చేయలేడేమో కానీ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లగలడు. రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, దూబే, రవీంద్ర జడేజాతో దుర్భేద్యంగా ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా సీఎస్కేలో ధోని ఉన్నాడు.
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బుమ్రా
పరుగుల వరద పారుతున్న మ్యాచ్ లో కూడా భూమ్రా ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపిస్తున్నాడు. బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో ఇదే మరోసారి రుజువైంది. వేగం, ఖచ్చితత్వం, తెలివిగా బంతులు సంధిస్తూ బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపిస్తున్నారు.
CSK జట్టులో శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే ఇద్దరు ముంబై కి చెందిన వారు. వీరు ఈ మ్యాచ్ లో వీరు సొంత మైదానానికి తిరిగి వచ్చారు. ఇక ముస్తాఫిజుర్ రెహ్మాన్ (9 వికెట్లు) తెలివిగల జడేజాలు చెన్నై సొంతం .
స్క్వాడ్స్
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (సి), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్ (వికెట్), అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్.
చెన్నై సూపర్ కింగ్స్: MS ధోని (WK), అరవెల్లి అవనీష్ (wk), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (c), అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నిశాంత్ సింధు, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేశ్ తీక్షణ, సమీర్ రిజ్వీ.
Read More
Next Story