ఐపీఎల్ రెండో దశ విదేశాల్లో జరగదు: అరుణ్ ధుమాల్
x

ఐపీఎల్ రెండో దశ విదేశాల్లో జరగదు: అరుణ్ ధుమాల్

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఐపీఎల్ విదేశాల్లో నిర్వహిస్తారనే ప్రచారాన్ని ఐపీఎల్ చైర్మన్ ఖండించారు.


సార్వత్రిక ఎన్నికల కారణంగా దేశంలో నిర్వహించనున్న ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహిస్తారనే వార్తలను బీసీసీఐ ఖండించింది. శనివారం ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఆయన మాట్లాడారు. నిన్న భారత ఎన్నికల సంఘం దేశంలో ఏడు దశల్లోఎన్నికలు జరగడానికి షెడ్యూల్ విడుదల అయింది.

దీంతో ఐపీఎల్ ను దుబాయ్ లో నిర్వహిస్తారని, ఆటగాళ్ల తమ పాస్ పోర్ట్ లను ప్రాంచైజీలకు డిపాజిట్ చేయమని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ధుమాల్ వీటిని ఖండించాడు.

"ఐపిఎల్‌ను ఎక్కడికీ మార్చడం లేదు. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తాము" అని ధుమాల్ జాతీయ మీడియాకు చెప్పారు.
మార్చి 22న స్వదేశంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడడంతో ఈ సీజన్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది.
ఇంతకుముందు జాతీయ మీడియాతో BCCI కార్యదర్శి జై షా మాట్లాడుతూ.. 2019 లోక్ సభ ఎన్నికల కాలంలో భారతదేశంలో ఎలా ఐపీఎల్ నిర్వహించామో.. ఇప్పుడు కూడా అలాగే ఈ లీగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించిన తరువాత రెండో షెడ్యూల్ ను విడుదల చేస్తామని ఐపీఎల్ కౌన్సిల్ ప్రకటించింది.
అయితే, 2014లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా లీగ్‌ని దేశం నుంచి తరలించారు. రెండో దశ మాత్రం యూఏఈ నుంచి తిరిగి ఇండియా కు తరలించారు.
Read More
Next Story