ఐపీఎల్ మొదటి షెడ్యూల్ విడుదల.. రెండో షెడ్యూల్ ఎప్పుడంటే..
x

ఐపీఎల్ మొదటి షెడ్యూల్ విడుదల.. రెండో షెడ్యూల్ ఎప్పుడంటే..

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. అయితే ఈసారి ఐపీఎల్ ఎన్నికల దృష్ట్యా రెండు విడతలుగా నిర్వహించనున్నారు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ మొదటి రెండు వారాల షెడ్యూల్ భారత క్రికెట్ నియంత్రణ సంస్థ(బీసీసీఐ) విడుదల చేసింది. మార్చి 22, 2024న నుంచి ఏప్రిల్ 7, 2024 మధ్య మొదటి షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ లు జరుగుతాయని ప్రకటించింది. రెండు వారాల వ్యవధిలో 21 మ్యాచ్ లు జరగనున్నట్లు వెల్లడించింది. దీని కోసం 10 నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ప్రతి జట్టు కనీసం మూడు నుంచి గరిష్టంగా ఐదు మ్యాచ్ లు ఆడనున్నట్లు ప్రకటించింది. 17 వ సీజన్ విజేత ఢిపెండింగ్ ఛాంపియయన్, ఐదు సార్లు విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ను చెన్నై చెపాక్ వేదికగా ఢీకొంటుంది.

వారాంతంలో డబుల్ మ్యాచ్ లు.

ఐపీఎల్ ఇంతకుముందు జరిగిన సీజన్ లాగే వారాంతాల్లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. శనివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొంటుంది. తరువాత కోల్ కత నైట్ రైడర్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ను భాగ్యనగరం వేదికగా ఢీ కొడుతుంది. ఆదివారం మధ్యాహ్నం మార్చి 24న జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, లోకల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ తో పోటీపడుతుంది. మరో మ్యాచ్ లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో గత సీజన్ ఫైనలిస్ట్ ఐదుసార్లు విజేత అయిన ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది.

విశాఖలో ఢిల్లీ మ్యాచ్ లు

ఈసారి ఆశ్చర్యకరంగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ కు కేటాయించిన మొదటి రెండు హోం మ్యాచ్ లను విశాఖ వేదికగా ఆడాలని నిర్ణయించుకుంది. మార్చి 31 ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో, ఏప్రిల్ 3న కోల్ కత్త నైట్ రైడర్స్ తో విశాఖ వేదిక ఆడుతుంది.

మిగిలిన షెడ్యూల్ ఎప్పుడంటే




వచ్చెనెల ప్రారంభంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకుని మిగిలిన ఐపీఎల్ షెడ్యూల్ ను విడుదల చేస్తామని బీసీసీఐ చెబుతోంది. " గతంలో వలె బీసీసీఐ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, భద్రతాసంస్థలతో కలిసి పని చేస్తుంది. అన్ని నిబంధలను కచ్చితంగా పాటిస్తుంది. 18 వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత బోర్డు సమీక్షించి పోలింగ్ తేదీలను పరిగణలోకి తీసుకుని మిగిలిన సీజన్ షెడ్యూల్ ను ఖరారు చేయడానికి బీసీసీఐ స్థానిక అధికారులతో కలిసి పని చేస్తుంది" అని బీసీసీఐ అధికారులు వెల్లడించారు.

2009లో మాత్రమే ఐపీఎల్ పూర్తిగా విదేశాల్లో( దక్షిణాఫ్రికా) నిర్వహించారు. తరువాత 2014 ఎడిషన్ ను సాధారణ ఎన్నికల కారణంగా యూఏఈలో పాక్షికంగా నిర్వహించారు. 2019 లో ఎన్నికలు ఉన్నప్పటికీ భారత్ లోనే టోర్నీ నిర్వహించారు. ప్రస్తుతం భారత్ లో ఏప్రిల్- మే ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది.

Read More
Next Story