ఐపీఎల్: ఆ విధానం అంత మంచిది కాదు.. రిషబ్ పంత్
ఐపీఎల్ లో ఇంపాక్ట్ సబ్ విధానంపై ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ రిషబ్ పంత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్కోరు బోర్డుపై ఎన్ని పరుగులు పెట్టిన..
ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ విధానంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషత్ పంత్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్కోర్ బోర్డుపై 250 పరుగులు చేసిన విజయం పై ధీమా లేకుండా ఉన్నామని అన్నారు. ఒక దశలో విపరీతంగా కంగారు పడ్డామని ఈ ఢిల్లీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ అన్నారు.
నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ల జట్టు చరిత్రలోనే 4 వికెట్లకు 257 పరుగులు సాధించింది. ఛేజింగ్ లో ముంబై ఇండియన్స్ 9 వికెట్లకు 247 పరుగులు సాధించింది. తిలక్ వర్మ 32 బంతుల్లో 63 పరుగులు సాధించాడు.
"బోర్డులో 250 పరుగులు పెట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము, కానీ ఇంపాక్ట్ సబ్ విధానంతో ఎంత పెద్ద లక్ష్యమైన కాపాడుకోవడం కష్టమవుతోంది. ఇలాగే ప్రతిరోజు జరుగుతోంది." అని పంత్ మ్యాచ్ అనంతరం అన్నారు. ముంబై బ్యాట్స్ మెన్ చెలరేగకుండా తమ బౌలర్లు ముఖేష్ కుమార్, రసిఖ్ దార్లు కట్టడి చేశారని కొనియాడారు.
టిమ్ డేవిడ్ వంటి బ్యాట్స్ మెన్ ముందుకు వచ్చి బ్యాటింగ్ చేశారని అతని లాంటి వారిని కట్టడి చేయాలంటే కచ్చితమైన లైన్ అండ్ లెంత్ తో బాల్ సంధించాలని పంత్ అన్నారు. తమ జట్టు ఒపెనర్ జేక్ ప్రేజర్ మెక్ గర్క్ ను కూడా పంత్ ప్రశంసల్లో ముంచెత్తాడు.
సుడిగాలి వేగంతో బ్యాటింగ్ చేస్తూ పరుగులు సాధిస్తున్నాడని అన్నారు. ప్రేజర్ ఈ మ్యాచ్ లో 24 బంతుల్లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 82 పరుగులు సాధించాడు. మ్యాచ్, మ్యాచ్ కు ప్రేజర్ రాటుదేలుతున్నాడని, ఒక యువ ఆటగాడి నుంచి తాము ఇదే కోరుకుంటున్నామని పంత్ అన్నారు.
ఇంపాక్ట్ విధానంపై అభ్యంతరాలు
ఐపీఎల్ లో తాజాగా ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ విధానంపై అసంతృప్తుల జాబితా క్రమక్రమంగా పెరుగుతోంది. మాజీల నుంచి మొదలు భారత కెప్టెన్ వరకూ అందరూ ఈ విధానం బాగా లేదని అంటున్నారు. ముఖ్యంగా బౌలర్ల తీవ్రంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, ఇండియాలో ఆల్ రౌండర్ల కొరతను ఇంకా ఎక్కువ చేస్తుందని కూడా క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సునీల్ గవాస్కర్, హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్, కామెంటేటర్ హర్ష భోగ్లే ఇలా ఇంపాక్ సబ్ విధానం పై పెదవి విరిచారు. బీసీసీఐ దీనిని వెంటనే సమీక్షించాలని కోరారు. తాజాగా ఈ జాబితాలో ఇప్పుడు పంత్ కూడా చేరాడు.
Next Story