ఐపీఎల్: పాపం.. మోహిత్ శర్మ.. పంత్ ధాటికి కొత్త రికార్డు నెలకొల్పాడు
x

ఐపీఎల్: పాపం.. మోహిత్ శర్మ.. పంత్ ధాటికి కొత్త రికార్డు నెలకొల్పాడు

ఐపీఎల్ లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. బ్యాట్స్ మెన్ల వీరబాదుడికి బౌలర్లు బలవుతూ కొత్త రికార్డులు తమ పేరు పై నమోదు చేసుకుంటున్నారు. తాజాగా మోహిత్ శర్మ..


ఒకప్పటి భారత పేస్ బౌలర్, ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న మోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా శర్మ బౌలింగ్ ను ఢిల్లీ బ్యాట్స్ మెన్ ఓ ఆటాడుకున్నారు. ఈ రైట్ ఆర్మ్ బౌలర్ అతని నాలుగు ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 73 పరుగులు సమర్పించుకున్నాడు.

దీంతో ఇంతకుముందు బాసిల్ థంపి పేరుమీదున్న చెత్త రికార్డు ఇప్పుడు మోహిత్ ఖాతాలో చేరింది. మొదటి మూడు ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్న మోహిత్, చివరి ఓవర్లో బౌలింగ్ కు దిగగా, ఢిల్లీ కెప్టెన్ పంత్ ఆకాశమేహద్దుగా చెలరేగాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్, మోహిత్ శర్మను ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయమని బంతిని అందించాడు.

మోహిత్‌ను బౌలింగ్ లో స్ట్రైక్‌లో ఉన్న పంత్ మొదటి బంతికి రెండు పరుగులు చేశాడు. రెండో డెలివరీ వైడ్‌ కాగా, తర్వాత పంత్ రెచ్చిపోయాడు. వరుసగా 6, 4, 6, 6, 6 కొట్టి స్టేడియంలోని ప్రేక్షకులు, డగౌట్లోని తన సహచరులను ఆనందంలో ముంచెత్తాడు. ఈ ఓవర్లో 31 పరుగులు రాబట్టిన పంత్.. మ్యాచ్ లో 43 బంతులను ఎదుర్కొని 88 పరుగులు సాధించాడు.
ఇందులో 5x4, 8x6 ఉన్నాయి. మొదట కేవలం రెండువందల పరుగులు సాధిస్తుందని అనుకున్న ఢిల్లీ, పంత్ ధాటికి 225 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కు నిర్దేశించింది. ఈ మ్యాచ్ సమయంలో, పంత్ మోహిత్ నుంచి 23 బంతులు ఎదుర్కొని, 204.34 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. అందులో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల ఉన్నాయి. మొత్తంగా 47 పరుగులు పిండుకున్నాడు.
20 ఓవర్లలో గుజరాత్ 220/8 మాత్రమే సాధించి, నాలుగు పరుగుల తేడాతో ఓడింది. IPL చరిత్రలో మోహిత్ భారీగా పరుగులు సమర్పించుకోవడంతో మరోసారి టీ20 గేమ్ గురించి చర్చ మొదలైంది. ఇది బ్యాట్స్ మెన్ గేమ్ గా మారిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ బెంగళూర్ తో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘నేను బ్యాట్స్ మెన్ ఎందుకు కాలేదని అనుకున్నాను’ అని వ్యాఖ్యానించడం ఈ టీ20లో బ్యాట్స్ మెన్ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సీజన్ IPLలో, ఇప్పటి వరకూ జరిగిన 40 మ్యాచ్‌ల్లో 12 సార్లు 200-ప్లస్ స్కోర్లు నమోదయ్యయంటే బ్యాట్స్ మెన్ల ఆధిపత్యం ఎలా సాగుతుందో అర్ధం చేసుకోచ్చు. గవాస్కర్ మాజీ ఇప్పటికే దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాట్, బంతికి సమతూకం ఉండాలని లేదంటే ప్రేక్షకులకు సైతం విసుగు వస్తుందని సలహ ఇస్తున్నాడు.
ఏప్రిల్ 15న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 287/3 స్కోర్ చేయడంతో T20 టోర్నమెంట్‌లో, IPL 2024 కూడా అత్యధిక స్కోరుగా రికార్డుల కెక్కింది. అంతకుముందు SRH, ముంబై ఇండియన్స్ (MI)పై 277/3 పరుగులు సాధించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ పవర్ ప్లే లో ఏకంగా 125 పరుగులు సాధించింది. దీంతో బౌలర్లు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఎక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్లు..
4 ఓవర్లలో 0/73 (ఎకానమీ 18.25) - మోహిత్ శర్మ (GT vs DC), 2024
4 ఓవర్లలో 0/70 (17.50) - బాసిల్ థంపి (SRH vs RCB), 2018
4 ఓవర్లలో 0/69 (17.25) - యష్ దయాల్ (GT vs KKR), 2023
4 ఓవర్లలో 1/68 (17.00) - రీస్ టాప్లీ (RCB vs SRH), 2024
4 ఓవర్లలో 0/66 (16.50) - ఇషాంత్ శర్మ (SRH vs CSK), 2019
Read More
Next Story