x

ప్రభుత్వ విధానం వల్లే అవినీతి పెరుగుతోందా ?

అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడి కోర్టుల్లో చార్జిషీటు దాఖలకు అనుమతులురాక వందలాది కేసులు ప్రభుత్వం దగ్గర పెండింగులో ఉంటున్నాయి


అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడి కోర్టుల్లో చార్జిషీటు దాఖలకు అనుమతులురాక వందలాది కేసులు ప్రభుత్వం దగ్గర పెండింగులో ఉంటున్నాయి. లంచాలు తీసుకుంటు కొందరు, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదనలో మరికొందరు ఏసీబీకి పట్టుబడుతున్నారు. వీరిపై దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీటు దాఖలు చేసి ప్రాసిక్యూషన్ కు అనుమతులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోవటంలేదు.

అవినీతి అధికారులపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి ప్రాసిక్యూట్ చేయాలంటే ప్రభుత్వం అనుమతించాల్సిందే. ఇక్కడే ఏసీబీకి దొరికిన వందలాదిమంది అవినీతి అధికారులు తప్పించుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. 2025 డిసెంబర్ వరకు ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని ఏసీబీ 650 కేసుల విషయంలో ప్రభుత్వానికి లేఖలు రాస్తే అనుమతి వచ్చింది కేవలం 115 కేసుల్లో మాత్రమే.

చాలా కేసుల్లో ప్రాసిక్యూషన్ కు వివిధ శాఖల ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వకపోవటం లేదా ఏ సంగతి తేల్చకపోవటంతోనే అవినీతి అధికారులపై ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. కారణం ఏమిటంటే పట్టుబడిన అధికారుల్లో చాలామంది తమ శాఖాధిపతుల దగ్గర ఏదో పద్దతిలో మ్యానేజ్ చేసుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. వివిధ శాఖల్లో అవినీతి జరగుతున్నది వాస్తవం, ఏసీబీ దాడులు చేసి పట్టుకుంటున్నదీ వాస్తవమే.

దర్యాప్తు తర్వాత ఏసీబీని ముందుకు పోనీకుండా వెనక్కులాగుతున్నది కూడా ప్రభుత్వమే. అలాంటపుడు ఏసీబీ దాడులు చేసి అవినీతి అధికారులను పట్టుకుని ఉపయోగం ఏమిటి ? దీనికి బాధ్యులు ఎవరు ? అనే చర్చలు పెరిగిపోతున్నాయి.

Read More
Next Story