శ్రీలంక  ‘తమిళ పులి’ అంతరించలేదా?
x

శ్రీలంక ‘తమిళ పులి’ అంతరించలేదా?

‘నాన్నా,పులి’ అనే కథ ద్వారా చివరకు తేలిందేమిటి పులి నిజం అనే. ఇపుడు శ్రీలంకలో కూడా అదిగో పులి, ఇదిగో పులి అని అరుపులు వినబడుతున్నాయి. పులివస్తుందా? ఏంది కథ?



ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్ జీవించి ఉన్నాడని నిరాధారమైన వాదనలతో తోసిపుచ్చేందుకు ఆయన కుటుంబసభ్యులు ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రభాకరన్ మరణాన్ని బహిరంగంగా స్మరించుకోవాలని భావిస్తున్నారు.

ఎందుకు ఇలా..

2009లో శ్రీలంకలోని ముల్లైతీవు జిల్లాలో జరిగిన పోరాటంలో ప్రభాకరన్ మరణించాడు. అయితే అతను చనిపోలేదని LTTE పేర్కొంది. ప్రభాకరన్ విధేయులుగా పేరున్న తమిళనాడు రాజకీయ నాయకులు కొందరు ఇదే వాదనను నేటికీ కొనసాగిస్తున్నారు. ప్రభాకరన్ మరణాన్ని నిరాకరించడానికి ప్రధాన కారణం LTTE ఆర్థిక సామ్రాజ్యం అంతం కావడమే. ఈ క్రమంలో LTTE చీఫ్ సజీవంగా ఉన్నాడని కొందరు స్కామ్‌స్టర్లు ప్రచారానికి తెరదీశారు. ప్రభాకరన్ కోసం, ఆయన కుటుంబ వైద్య ఖర్చుల కోసం వీరు డబ్బును సేకరించే సిద్ధమయ్యారన్న వార్తల నేపథ్యంలో ప్రభాకరన్ కుటుంబసభ్యలు ప్రభాకరన్ మరణాన్ని బహిరంగంగా స్మరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.

నెడుమారన్‌ వాదనేంటి?

ప్రభాకరన్ బతికే ఉన్నారని, త్వరలో కనిపిస్తారని తమిళనాడు రాజకీయ నాయకుడు పి నెదుమారన్ గతంలో ఓ సారి చెప్పారు. ప్రభాకరన్ కోరిక మేరకే తాను మాట్లాడుతున్నానని కూడా చెప్పారు. ప్రభాకరన్ గౌరవించే అతికొద్ది మంది భారతీయ రాజకీయ నాయకులలో నెడుమారన్ కూడా ఒకరు. ఈ వాదన శ్రీలంక తమిళ ప్రవాసులతో సహా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత గత ఏడాది నవంబర్‌లో ప్రభాకరన్ ఏకైక కుమార్తె ద్వారక చేసిన 12 నిమిషాల ప్రసంగం సోషల్ మీడియాలో కనిపించింది. తమిళ ఈలం కోసం రాజకీయ పోరాటం కొనసాగుతుందని త్వరలో తాను శ్రీలంకను సందర్శిస్తానని ఆమె పేర్కొంది.

ఇది ఫేక్ వీడియో అని, ప్రభాకరన్ కూతురిగా చెప్పుకుంటున్న మహిళ స్విట్జర్లాండ్‌లోని తమిళ మూలానికి చెందిన వేరొక అమ్మాయి అని ప్రచారం జరిగింది.

నిధుల కోసం అపోహ..

‘‘LTTEకి విరాళాలు ఆగిపోకుండా చూసేందుకు కేవలం ప్రభాకరన్ మాత్రమే కాకుండా అతని కుటుంబం మొత్తం యుద్ధం నుంచి తప్పించుకుందని అపోహ సృష్టించారు ’’అని బ్రిటన్‌లోని శ్రీలంక తమిళ మూలం ది ఫెడరల్‌కి తెలిపింది. ఈ వాదన ప్రభాకరన్ మరణించారు అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేని LTTE మద్దతుదారులకు సరిపోతుంది. అయితే ప్రభాకరన్ ఏకైక అన్నయ్య మనోహరన్ కరుణాకర్ స్మారకాన్ని నిర్మింస్తున్నట్లు బహిరంగంగానే చెప్పారు. "ప్రభాకరన్ కుటుంబం యుద్ధం చివరి దశ ఉన్నపుడు తప్పించుకుందని వస్తున్న వార్తలకు ముగింపు పలకాలని అనుకుంటున్నాం, ప్రభాకరన్, అతని భార్య మతివతని, వారి పిల్లలు వర్ధంతిని గుర్తుగా చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం వారికి అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తాం’’ అని మనోహరన్ కుమారుడు కార్తీక్ మనోహరన్ జాఫ్న చెప్పారు.

మే19న ప్రభాకరన్ హతం..

ప్రభాకరన్ భార్యతో పాటు కూతురు ద్వారకని కూడా శ్రీలంక సైనిక బలాగాలు యుద్ధం చివరి దశలో ఉన్నపుడు చంపేశాయి. ప్రభాకరన్ పెద్ద కుమారుడు, చార్లెస్ ఆంటోనీ కూడా ఈ పోరాటంలో మరణించాడు. చిన్న కుమారుడు బాలచంద్రన్ ను శ్రీలంక దళాలు ఉరితీశాయి. శ్రీలంక సైన్యం ప్రకారం.. మే 19, 2009న ఒక మడుగులో డజన్ల కొద్దీ LTTE యోధులతో పాటు ప్రభాకరన్ కూడా మరణించారు.

మోసాల గురించి తెలుసు..

ఎల్టీటీఈ వ్యవస్థాపక నాయకుడి పేరుతో జరుగుతున్న మోసాల గురించి తమకు తెలుసని ప్రభాకరన్ కుటుంబం స్పష్టం చేసింది. "ఈ స్మారక కార్యక్రమం కొనసాగుతున్న మోసపూరిత దోపిడీ అరికట్టడానికే " అని మనోహరన్ చెప్పారు. యుద్ధభూమిలో నా మేనమామ ప్రభాకరన్, అతని కుటుంబం ధైర్య జీవితాలు, పరాక్రమ త్యాగాలను స్మరించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.

2009 యుద్ధం..

"2009లో జరిగిన యుద్ధంలో మా మామ ప్రభాకరన్, ఆయన కుటుంబం అమరులయ్యారని నేను అంగీకరించాను. ప్రభాకరన్ స్మారక చిహ్నం గౌరవప్రదంగా ఉండేలా చూడాలనుకుంటున్నాం. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకునే సందర్భం ఇది.’’ అన్నారు మనోహరన్. ప్రభాకరన్ కుటుంబానికి తన తల్లిదండ్రులు ఏటా ప్రైవేట్ సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కూడా చెప్పారు మనోహరన్.

ప్రభాకరన్ గురించి..

నవంబర్ 1954లో జాఫ్నాలోని మధ్యతరగతి తమిళ కుటుంబంలో జన్మించిన నలుగురు తోబుట్టువులలో ప్రభాకరన్ చిన్నవాడు. అతని ఏకైక సోదరుడు, ఇద్దరు సోదరీమణులకు వివాహాలు జరిగాయి. వివిధ దేశాల్లో నివసిస్తున్నారు.

1970 ప్రారంభంలో మిలిటెన్సీని ప్రారంభించిన ప్రభాకరన్ జాఫ్నా మేయర్ ఆల్‌ఫ్రెడ్ దురియప్పను హత్య చేశారు. సంవత్సరం తర్వాత 1976లో LTTEని స్థాపించాడు. అతను జాఫ్నాకు తిరిగి వచ్చినప్పుడు 1983 చివరి నుండి జనవరి 1987 వరకు తమిళనాడులో ఉన్నాడు. మే 1991లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేయాలని ఆదేశించాడు. చివరకు మే 2009లో జరిగిన యుద్ధంలో ప్రభాకరన్ చనిపోయారు.

Read More
Next Story