రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ సనాతన ధర్మానికి విరుద్ధంగా జరుగుతోందా?
x

రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ సనాతన ధర్మానికి విరుద్ధంగా జరుగుతోందా?

అయోధ్యలో బాలరాముడి (రామ్‌లల్లా) విగ్రహ ప్రతిష్ఠ సనాతన ధర్మ నిబంధనలను విరుద్ధంగా జరుగుతుందా? ఆ నలుగురు పీఠాధితులు చెబుతున్నదేంటి?


అయోధ్యలో సనాతన ధర్మ నిబంధనలను ఉల్లంఘించారని, ఆ కారణంగా తాము జనవరి 22న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకావడం లేదని కర్ణాటకలోని శృంగేరి, గుజరాత్‌లోని ద్వారక, ఒడిశాలోని పూరి, ఉత్తరాఖండ్‌ జోషిమఠ్ మఠాధిపతులు తెలిపారు.

అలా ప్రాణ ప్రతిష్ఠ చేయకూడదు..

జోషిమఠ్‌ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ మాట్లాడుతూ.. ‘‘హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా ఆలయ ప్రతిష్ఠాపన జరుగుతోంది. అందుకే మేం నలుగురం ఆ కార్య్రకమానికి హాజరుకావడంలేదు. ఆలయ నిర్మాణం పూర్తికాకుండానే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం సంప్రదాయాలకు విరుద్ధం.’’ అని తెలిపారు. మాకు ప్రధాని మోదీతో సహా ఎవరిపైనా దురుద్దేశం లేదని, మేం మా ధర్మాన్ని మాత్రమే పాటిస్తున్నామని స్పష్టత ఇచ్చారు. "మేము మోదీకి వ్యతిరేకం కాదు. అదే సమయంలో మన ధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా కూడా వెళ్ళలేం" అని అవిముక్తేశ్వరానంద్ అన్నారు.

పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి కూడా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావడానికి నిరాకరించారు. హిందూ సంప్రదాయాల ఉల్లంఘనపై ఆయన ఆందోళన లేవనెత్తారు. ‘‘ప్రాణ ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలు సంప్రదాయాలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. దానివల్ల విగ్రహ తేజస్సు తగ్గిపోతుంది.’’ అని పేర్కొన్నారు.

ప్రాణ ప్రతిష్ట వేడుక మతపరమైన దాని కంటే రాజకీయంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక మార్గదర్శకాలకు కట్టుబడి లేదని నిశ్చలానంద సరస్వతి అన్నారు. “దేశ ప్రధానమంత్రి గర్భగుడిలో ప్రవేశిస్తారు. విగ్రహాన్ని తాకి, ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగాలంటే అది గ్రంధ సూత్రాల ప్రకారమే జరగాలి. కాని దీనికి రాజకీయ రంగు పులుముకుంది. నేను ఆ కార్యక్రమానికి హాజరుకాను. వ్యతిరేకించను. కూడా’’అని చెప్పారు.

నివేదికల ప్రకారం, జనవరి 16న వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. జనవరి 22న వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్‌ సమక్షంలో ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుంది.

Read More
Next Story