ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాదేనా!
x

ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాదేనా!

ఊహించని అనేక మలుపుల మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్ కి చేరింది. రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.


ఊహించని అనేక మలుపుల మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్ కి చేరింది. తక్కువ స్కోరుతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడిస్తుందా లేదా అనుమానాలను పటాపంచలు చేస్తూ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐపిఎల్‌ సీజన్‌-17 ఫైనల్లోకి ఆరేళ్ల తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు దూసుకెళ్లింది. చిదంబరం స్టేడి యం వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌- 2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌పై 36పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో విధ్వంసక బ్యాటింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. తొలి క్వాలిఫయర్లో ఆ జట్టు బ్యాటర్లు తేలిపోయిన నేపథ్యంలో రెండో క్వాలిఫయర్లోనైనా విజయం సాధిస్తారా లేదా అనే అనుమానాలు కొనసాగాయి. దానికి తగ్గట్టే రెండో క్వాలిఫయర్లోనూ బ్యాటర్ల తడబాటు కొనసాగింది. రాజస్థాన్‌ ముందు నిలిచిన లక్ష్యం 176 పరుగులే కావడంతో ఓ దశలో హైదరాబాద్ జట్టు ఓటమి పాలవుతుందేమోనని హైదరాబాద్ జట్టు అభిమానులు డీలా పడ్డా చివరకు విజయం సన్ రైజర్స్ హైదరాబాద్ నే వరించింది. మే 26న హైదరాబాద్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నైలో ఫైనల్ ఆడుతుంది. 2016లో ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్‌.. 2018లో రన్నరప్‌ అయింది.

పవర్‌ ప్లేలో జైస్వాల్‌ మెరుపు బ్యాటింగ్‌ చూసిన వారికి రాయల్స్‌ సులువుగా మ్యాచ్‌ గెలిచేస్తుందనే అనిపించింది. మరో ఓపెనర్‌ కోహ్లెర్‌ క్యాడ్‌మోర్‌ తడబడినా.. యశస్వి స్వేచ్ఛగా బ్యాట్‌ ఝళిపిస్తూ జట్టును ముందుకు నడిపించాడు. షాబాజ్‌.. యశస్విని ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ ఓవర్లో రెండో బంతికే సిక్సర్‌ బాదిన జైస్వాల్‌.. మరో షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. ఈ ఓవర్లో బంతి తిరిగిన తీరు చూసి మరో ఎండ్‌లో పార్ట్‌టైమర్‌ అభిషేక్‌ను దించాడు కమిన్స్‌. ఎంతో కీలకమైన సంజు శాంసన్‌ వికెట్‌ తీశాడు. మార్‌క్రమ్‌ డీప్‌ మిడ్‌వికెట్‌లో సంజు క్యాచ్‌ను చక్కగా అందుకున్నాడు. వెంటవెంటనే రెండు కీలక వికెట్లు పడడంతో స్కోరు వేగం పడిపోయింది. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. ఒత్తిడికి గురైన పరాగ్‌ కూడా భారీ షాట్‌ ఆడబోగా.. క్యాచ్‌ ఔట్‌ అయి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ వికెట్‌నూ షాబాజే తీశాడు. బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందు వచ్చిన అశ్విన్‌ సైతం అతడికే వికెట్‌ సమర్పించుకున్నాడు. బ్యాటర్లు ఎంత గట్టిగా ప్రయత్నించినా షాట్లు ఆడడం కష్టమని, రాజస్థాన్‌ గెలవడం కష్టమే అని అప్పుడే అర్థమైపోయింది. ప్రమాదకర హెట్‌మయర్‌ ను అభిషేక్‌ బౌల్డ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ విజయం దాదాపు ఖాయమైపోయింది. అయినా ఒక ఎండ్‌లో ధ్రువ్‌ జురెల్‌ పోరాడాడు. కానీ అతడికి సహకారం కరవైంది. ఎలిమినేటర్‌లో రాయల్స్‌ను గెలిపించిన రోమన్‌ పావెల్‌ ఈసారి తేలిపోయాడు. 3 ఓవర్లలో 53 పరుగులు అవసరమైన స్థితిలో నటరాజన్‌ ఒక్క పరుగే ఇచ్చి పావెల్‌ను ఔట్‌ చేయడంతో రాయల్స్‌కు దారులు మూసుకుపోయాయి. తర్వాత జురెల్‌ కూడా అద్భుతాలేమీ చేయలేకపోయాడు.
ఈ సీజన్లో విధ్వంసక బ్యాటింగ్‌తో భారీ స్కోర్లు నమోదు చేసిన సన్‌రైజర్స్‌.. చెన్నై పిచ్‌ మీద వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ.. దూకుడు తగ్గించకపోవడంతో ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది.
కలిసొచ్చిన ‘ఇంపాక్ట్‌’ నిబంధన..
రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధన కలిసొచ్చింది. ఇన్నాళ్లూ తుది జట్టులో కొనసాగినా పెద్దగా ప్రభావం చూపని షాబాజ్‌ అహ్మద్‌.. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట సన్‌రైజర్స్‌ 120/6తో ఉన్న దశలో బ్యాటింగ్‌కు వచ్చి 18 పరుగులు చేసిన షాబాజ్‌.. అనంతరం స్పిన్‌కు సహకరిస్తున్న చెపాక్‌ పిచ్‌ను చక్కగా ఉపయోగించుకుని మూడు వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌ను గట్టి దెబ్బ తీశాడు. 65/1తో రాయల్స్‌ పటిష్ట స్థితిలో ఉండగా.. యశస్విని ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పింది అతనే. తర్వాత ప్రమాదకర పరాగ్‌తో పాటు అశ్విన్‌నూ అతను పెవిలియన్‌ చేర్చాడు.
హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ- ఐపీఎల్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. 2009, 2016లో టైటిల్‌ గెలిచిన ఆ జట్టు 2018లో ఫైనల్లో ఓడింది. ఇందులో మూడు సందర్భాల్లో ఆస్ట్రేలియా క్రికెటరే హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్లుగా ఉన్నారు. ఇంతకుముందు గిల్‌క్రిస్ట్‌ (డెక్కన్‌ ఛార్జర్స్, 2009), వార్నర్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్, 2016) కెప్టెన్లుగా ఉన్నారు. ఇప్పుడు కమిన్స్‌ జట్టుకు సారథి.
తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 175పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భాగంగా ఓపెనర్‌ జైస్వాల్‌(42) రాణించినా.. టామ్‌ కోహ్లెర్‌(10), కెప్టెన్‌ సంజు(10), రియాన్‌ పరాగ్‌(6) నిరాశపరిచారు. ఆ తర్వాత జురెల్‌ అర్ధసెంచరీతో మెరిసినా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో రాజస్తాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7వికెట్ల నష్టానికి 139పరుగులే చేసి ఓటమిపాలైంది. తొలుత సన్‌రైజర్స్‌ బ్యాటర్లు హెన్రిక్‌ క్లాసెన్‌ అర్ధసెంచరీకి తోడు త్రిపాఠి, హెడ్‌ రాణించారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 175పరుగులు చేసింది. ఫైనల్‌ బెర్తు ఖాయమయ్యే పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(3/45), ఆవేశ్‌ ఖాన్‌(3/27), సందీప్‌ శర్మ(2/25) బౌలింగ్‌లో చెలరేగారు.
టాస్‌ ఓడిన హైదరాబాద్‌ తొలి ఓవర్లోనే వికెట్‌ కోల్పోయింది. డేంజరస్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మను బౌల్ట్‌ వెనక్కి పంపాడు. 13పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌ను రాహుల్‌ త్రిపాఠి ఆదుకున్నాడు. బౌల్ట్‌, అశ్విన్‌ ఓవర్లలో అలవోకగా భారీ షాట్లు ఆడుతూ బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, రాజస్థాన్‌ జట్టు ఒత్తిడిలో పడేశాడు. ఈ క్రమంలో ఐదో ఓవర్లో బౌల్ట్‌ వేసిన స్లో బాల్‌కు త్రిపాఠి స్లిప్‌లో చాహల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మర్‌క్రమ్‌ మరోసారి నిరాశపరిచాడు. అతడూ స్లిప్‌లో చాహల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 57కే మూడు వికెట్లు పడిన దశలో.. ట్రావిస్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌లు జట్టుకు భారీ స్కోర్‌ అందించే బాధ్యత తీసుకున్నారు. నాలుగో వికెట్‌కు వీరు 42 పరుగులు జత చేశారు.
ఈ జోడీని సందీప్‌ శర్మ విడదీసి హైదరాబాద్‌ను కష్టాల్లోకి నెట్టాడు. హెడ్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అబ్దుల్‌ సమద్‌ ఇలా వచ్చి అలా వెళ్లారు. ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన షాబాజ్‌ అహ్మద్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. క్లాసెన్‌కు సహకారం అందించడంతో 17 ఓవర్లకు జట్టు స్కోర్‌ 150కి చేరింది. ఆఖరి మూడు ఓవర్లలో భారీ షాట్స్‌ ఆడాలనుకున్న దశలో క్లాసెన్‌ ఔటవ్వడం సన్‌రైజర్స్‌ను దెబ్బతీసింది. అవేశ్‌ ఖాన్‌ వేసిన 20వ ఓవర్లో ప్యాట్‌ కమిన్స్‌(5నాటౌట్‌), ఉనాద్కట్‌(5)లు 6 పరుగులే చేశారు. దీంతో హైదరాబాద్‌ 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
ఆదివారం (మే 26 జరిగే ఫైనల్లో సీజన్‌-17 టైటిల్‌కై కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తలపడనుంది.
Read More
Next Story