
పూర్వాంచల్ పై బీజేపీ పట్టు సడలుతోందా?
ఈ ప్రాంతంలోనే ఉన్న కీలకమైన అయోధ్య, వారణాసి, ప్రయాగ్ రాజ్.. అయినప్పటికీ పట్టు బిగిస్తున్న ఎస్పీ
సిద్దార్థ్ తివారీ
వచ్చే ఏడాది లో దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీ తూర్పు ప్రాంతాన్ని పూర్వాంచల్ అని పిలుస్తారు. ఇది మొత్తం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా ఉన్న ప్రాంతంగా పిలుస్తారు.
అయితే కొన్ని నెలలుగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అధికారంలో ఉన్న బీజేపీకి ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కుల సమీకరణాలు, పొత్తులు క్రమంగా మారుతున్నాయి. అలాగే ఆయా ప్రాంతాల నాయకుల వైఖరిలోనూ మార్పు వస్తోంది. అది ఎన్నికల నాటికి ఎలాంటి ప్రభావం చూపుతోందో తెలుసుకోవడానికి ‘ది ఫెడరల్’ ఈ ప్రాంతాన్ని సందర్శించింది.
పూర్వాంచల్ ప్రాంతంలో బీజేపీ ఆధిపత్యం ఒక్కసారిగా ఏం ఏర్పడలేదు. హిందుత్వం ఆధారంగా రాజీకీయాలను నిర్మించి దశాబ్దాలుగా చేసిన ప్రయత్నమే ప్రస్తుతం విజయానికి కారణం. రామ మందిర ఉద్యమం విస్తృతమైన హిందూ ఓటర్ల పునరేకీకరణకు దారితీయంగా దళితులతో ఆర్ఎస్ఎస్ నిరంతరాయంగా సాగించిన సంప్రదింపులు పూర్వాంచల్ పై దానికి గట్టి పట్టు చిక్కడానికి కారణమైంది.
రాజకీయా పరిశీలకుల ప్రకారం.. పూర్వాంచల్ లో నెలకున్న పరిస్థితులు అక్కడి రాజకీయ పరిణామాలను దెబ్బతీయడంలో సాయపడ్డాయి. వాటిలో మొదటిది..గోరఖ్ నాథ్ మఠానికి పెరిగిన ఆదరణ. అక్కడి నుంచే యోగీ ఆదిత్యనాథ్ వచ్చారు. ఆయన తనకంటూ ప్రత్యేకమైన రాజకీయ వారసత్వాన్ని సృష్టించుకున్నారు. యోగీ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు తనకంటూ ప్రత్యేక పోటీ లేకుండానే చూసుకున్నారు.
యోగీ రైజింగ్..
‘‘సమాజ్ వాదీ పార్టీ లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్న గ్యాంగ్ స్టర్ లు.. అక్కడ అరాచకాలు చేస్తుండటంతో వాటికి సరైన విరుగుడు తన వల్లే అని యోగీ ప్రచారం చేసుకున్నాడు. ఈ మాఫియా వల్ల ఎక్కువ ప్రభావితం అయిన వారిలో కుర్మీలు, ఓబీసీలు అధికంగా ఉన్నారు. ఆయన మాటలు వారిలో ప్రాముఖ్యాన్ని తెచ్చిపెట్టాయి.’’ అని రాజకీయ పరిశీలకుడు సురేంద్ర దూబే ‘ది ఫెడరల్’ తో చెప్పారు. 1998 నుంచి జరిగిన ప్రతి లోక్ సభ ఎన్నికల్లో యోగీ ఎన్నికవుతూనే వస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయనకు ఇక్కడ మంచిపట్టు లభించడానికి కారణంగా మారింది.
ఈ ప్రాంతం ఎందుకు ముఖ్యమైనది..
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఉన్న 403 స్థానాలలో ఒక వంతు ఇక్కడే ఉన్నాయి. బీజేపీ రాజకీయాలకు కేంద్రమైన అయోధ్య, వారణాసి, ప్రయాగ్ రాజ్ ఇక్కడే ఉన్నాయి. ముఖ్యంగా యోగీ ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్ పూర్, మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసి ఈ పూర్వాంచల్ లో ఒక భాగం.
ఇండియా అగైనస్ట్ కరెప్షన్ అనే నినాదంలో కాషాయ ఏకీకరణ జరిగింది. దీని ద్వారా చివరకు బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరింది. సంక్షేమ పథకాల పంపిణీ, అభివృద్ది, శాంతి భద్రతలు అదుపులో ఉండటం ఇక్కడ హిందుత్వానికి అనుబంధంగా నిలిచాయి.
‘‘రామమందిర ఉద్యమాన్ని కేవలం గుర్తింపు రాజకీయ అంశంగా కాకుండా సామాజిక న్యాయానికి సంబంధించిన విషయంగా కూడా చూశారు. స్వచ్ఛమైన పాలన అందించిన మోదీ, ప్రాంతీయ పార్టీల కుటుంబ వారసత్వాలు చూసి విసుగు చెందిన ప్రజలకు ఇవన్నీ ఆకట్టుకున్నాయి’’ అని దూబే అభిప్రాయపడ్డారు.
విధేయత మారిందా?
2012 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 224 సీట్లు సాధించగా, బీజేపీ కేవలం 47 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అయితే తరువాత రాజకీయంగా వేర్వేరుగా ఉన్న వర్గాలను ఏకం చేసిన బీజేపీ 2017 లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. అప్పా దళ్ కుర్మీ ఓటర్లకు వారధిగా మారింది. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ) రాజ్ భర్ వర్గంలోకి, నిషాద్ పార్టీ రాజకీయంగా ఉన్న నిషాద వర్గాన్ని బీజేపీకి దగ్గరగా తీసుకొచ్చింది.
దీనితో 2017 లో 312 సీట్లతో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది. ఎస్పీ 47 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. 2022 లో బీజేపీ 255 సీట్లతో అధికారం నిలబెట్టుకుంది. కానీ దాని కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. ఎస్పీ 111 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అలాగే పూర్వాంచల్ ప్రాంతంలో 17 సీట్ల నుంచి 48 సీట్లకు పెంచుకుంది. ఇదే సమయంలో బీజేపీకి లభించిన 115 నుంచి 88కి పడిపోయింది.
లోక్ సభ ఎన్నికల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. 2014 లో 71 గెలుచుకున్న కాషాయ పార్టీ, 2019 నాటికి 62 కి, 2024 నాటికి 33 స్థానాలకు పడిపోయింది. ఎస్పీ 2014 లో ఐదు స్థానాలు గెలుచుకోగా, 2024 నాటికి 37కు పెంచుకుంది.
స్థిరమైన మిత్రులు లేకపోవడమేనా..
పూర్వాంచల్ రాజకీయ రంగంలో మరో కీలక లక్షణం ఏంటంటే.. చిన్న పార్టీల ఉనికి. 1995 లో బీఎస్పీ నాయకుడు సోనేలాల్ పటేల్ స్థాపించిన అప్నాదళ్, మరో బీఎస్పీ నాయకుడు అయిన ఓం ప్రకాశ్ రాజ్ భర్ స్థాపించిన 2002 లో స్థాపించిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, 2016 లో సంజయ్ నిషాద్ స్థాపించిన నిషాద్ పార్టీ ఉన్నాయి.
ఈ చిన్న పార్టీలకు ఎన్నికల్లో పరిమితమైన బలం ఉన్నప్పటికీ సాంప్రదాయ ఓటర్లను ఆకర్షించి కూటముల బలాన్ని పెంచడానికి సాయపడతాయి. అప్నాదళ్ పార్టీ కుర్మీలు, రాజ్ భర్ లు వెనకబడిన కులాలను, నిషాద్ పార్టీ నిషాద్ లు మల్లాలు, కేవత్ లతో సహ నదీ తీర ప్రాంతాలలోని సమాజాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో సహాయపడతాయి. కానీ వారి విధేయతలు మాత్రం శాశ్వతంగా మాత్రం లేవు. తమ రాజకీయ లెక్కలు మారినకొద్ది పొత్తులను పున: సమీక్షించుకునే అవకాశం ఉందని నిఫుణులు అంటున్నారు.
ఉదాహారణకు రాజ్ భర్ 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీని వీడి ఎస్పీతో చేతులు కలిపారు. దారా సింగ్ చౌహన్ కూడా మంత్రిగా రాజీనామా చేసి ఎస్పీలో చేరారు. ఆ తరువాత వీరు ఇద్దరు తిరిగి బీజేపీ గూటికి వచ్చారు.
‘‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారి బేరాసారాల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధాన పార్టీలు ఈ స్థానిక నాయకత్వం ఆధారపడటంతో కుల సమూహాలు, సమాంతర నాయకత్వాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాయి’’ అని రాజకీయ విశ్లేషకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్ పూర్ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ హర్ష్ సిన్హా పేర్కొన్నారు.
నాలుగు పక్షాల మధ్య పోరు..
మారుతున్న పొత్తులు, పోటీ పడుతున్న సామాజిక కూటములు 2027 పోటీకి నేపథ్యాన్ని ఏర్పరస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నాయకత్వంలో అగ్రవర్ణాలు, జాట్ యేతర దళితులు, యాదవేతర ఓబీసీల కూటమిని ఐక్యంగా ఉంచుకోవడానికి బీజేపీ తన సొంత హిందూత్వ వాదనను అభివృద్ధి, మెరుగైన శాంతి భద్రతలపై దృష్టి పెట్టింది.
‘‘సీఎం యోగీ పూర్వాంచల్ లో అభివృద్ధికి ప్రతీకగా నిలిచారు. ఆ ప్రాంతానికి పర్యాయపదంగా మారిన బాహుబలి మాఫియా సంస్కృతిని నిర్మూలించిన శక్తిగా నిలిచారు’’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దినేశ్ ప్రతాప్ సింగ్ ‘ది ఫెడరల్’ తో అన్నారు.
సింగ్ ప్రకారం.. 2024 ఎన్నికల ఫలితాలను పున: సమీక్షించిన అనంతరం బీజేపీ క్షేత్ర స్థాయి సమీకరణ ద్వారా తన కేడర్, ఓటర్ల బేస్ ను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తోంది. సీఎం స్వయంగా కార్యకర్తలను, ఓటర్లను కలుస్తున్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరి కూడా ఇదే ప్రాంతానికి చెందిన వారు. నితిన్ నబీన్ కూడా ఇదే ప్రాంతంలో ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మా పట్టును తిరిగి నిలుపుకుంటాము’’ అని సింగ్ నమ్మకంగా చెబుతున్నారు.
పీడీఏ ఫార్ములా...
రెండు దఫాలుగా ప్రభుత్వంలో ఉన్న బీజేపీపై ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకతను ఎలాగైన తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఎస్పీ భావిస్తోంది. ఇందుకోసం పిచ్ డా వర్గాలైన దళిత, అల్పాసంఖ్యాక్ వర్గాలు తోడ్పాటు అందిస్తాయని ఆశగా ఉంది.
‘‘2022, 2024 లో మా విజయాలను విస్తరించుకోవాలనే ఉద్దేశ్యంతో కాకుండా, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగీలకు లోక్ సభ, అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్న ప్రాంతం ఇదే కావడం వల్ల పూర్వాంచల్ మాకు మరింత ముఖ్యం. బీజేపీకి అత్యంత బాధ కలిగించే చోటనే అవమానకరమైన ఓటమిని అందించాలని కోరుకుంటున్నాము’’ అని ఎస్పీ అధికార ప్రతినిధి అభిషేక్ బాజ్ పాయ్ ‘ ది ఫెడరల్’ తో అన్నారు.
బీఎస్పీ తన దళిత, బ్రాహ్మణ కూటములై ఆశలు పెట్టుకోగా, పేపర్ లీక్ లు, ద్రవ్యోల్బణం, సర్ పై జరుగుతున్న ఆందోళనలు తమకు అనుకూలంగా మారుతాయని కాంగ్రెస్ ఆశిస్తోంది.
‘‘కోల్పోయిన పట్టును తిరిగి సాధించడమే కాకుండా పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఈసారి కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తాం’’ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ పాల్ అన్నారు.
‘‘దేశంలోని అన్ని ప్రాంతాల మాదిరిగానే పూర్వాంచల్ కూడా రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపుతోంది. మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈ ప్రాంతం వారే. ప్రజల విశ్వాసాన్ని పొందడానికి మాకు ఇవి సాయపడతాయి’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్ పుత్ అన్నారు.
Next Story
