బీఆర్ఎస్ సెంటిమెంటు హిడెన్ అజెండా ఇదేనా ?
x
KCR, KTR and Harish Rao

బీఆర్ఎస్ సెంటిమెంటు హిడెన్ అజెండా ఇదేనా ?

సెంటిమెంట్ ఆయుధం అన్నీసార్లు వర్కవుట్ కాదని తెలిసినా కారుపార్టీ నేతలు మాత్రం పదేపదే తెలంగాణ జనాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు


బీఆర్ఎస్ కు ఎప్పుడు సమస్యలు మొదలైనా వెంటనే తెలంగాణ సెంటిమెంటును రాజేయటం మొదలుపెడుతుంది. రాజకీయంగా తనపైన జరుగుతున్న దాడులనుండి తప్పించుకునే అవకాశం లేనపుడు, ఆరోపణలకు సరైన సమాధానాలు చెప్పుకోలేనపుడు వెంటనే సెంటిమెంట్ అనే ఆయుధాన్ని బయటకు తీస్తుంది. సెంటిమెంట్ ఆయుధం అన్నీసార్లు వర్కవుట్ కాదని తెలిసినా కారుపార్టీ నేతలు మాత్రం పదేపదే తెలంగాణ జనాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఇందుకు తాజా ఉదాహరణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో జరిగిన తప్పులు, అవకతవకలే.

బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలను జనాలు మరచిపోకముందే ఇపుడు పాలమూరు-రంగారెడ్డి(పీఆర్) ప్రాజెక్టు వివాదాస్పదమైంది. పీఆర్ ప్రాజెక్టుకు అవసరమైన జలాలను తీసుకునేందుకు అన్నివిధాలుగా అనువైన జూరాలను కాదని శ్రీశైలంకు పాయింట్ మార్చటం కూడా పెద్ద వివాదాస్పదమవుతోంది. అలాగే సాగునీటికి కాకుండా కేవలం తాగునీటికి మాత్రమే పీఆర్ ప్రాజెక్టును ఉపయోగించుకుంటామని, కృష్ణా జలాల వాటల్లో 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టడంలాంటి అనేకఅంశాలు ఇపుడు హైలైట్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల వాదనతో బీఆర్ఎస్ బాగా ఇబ్బందులు పడిపోతోంది. అందుకనే రేవంత్, మంత్రులు లెవనెత్తిన పాయింట్లకు సరైన సమాధానం చెప్పుకోలేక రేవంత్, చంద్రబాబు, ఏపీ పాలకుల దోపిడీ అంటు హరీష్, కొందరు ఎంఎల్ఏలు సెంటిమెంటును రాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రబాబు ప్రస్తావన ఇందుకేనా ?


అసెంబ్లీలోనే కాదు బయట, పార్టీఆఫీసులో కూడా చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కయ్యాడని, చంద్రబాబుకు గురుదక్షిణగా రేవంత్ తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన జలాలను వదులుకుంటున్నాడని నానా గోలచేస్తున్నారు. ఇంత సడెన్ గా హరీష్, బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఎందుకింతగా సెంటిమెంటును రాజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ?

ఎందుకంటే, ఎన్నికలు అంటేనే బీఆర్ఎస్ కు సెంటిమెంటు గుర్తుకువస్తుంది. అందుకనే ఇపుడు తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ఈనెలాఖరులోనో లేకపోతే ఫిబ్రవరిలోను మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ రెండు ఎన్నికల్లోను గణనీయమైన ఫలితాలు సాధించకపోతే బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవనే ప్రచారం అందరికీ తెలిసిందే. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎందులోను బీఆర్ఎస్ గెలవలేదు. పార్లమెంటు ఎన్నికల్లో అయితే పోటీచేసిన 17 సీట్లలో ఒక్కదానిలో కూడా గెలవలేదు.

ఎన్నికల్లో కష్టమేనా ?


మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో పర్వాలేదన్నట్లుగా మాత్రమే పెర్ఫార్మ్ చేసింది. తొందరలో జరగబోయే ఎన్నికల్లో గెలవాలంటే సెంటిమెంటు ఆయుధం ఒక్కటే ఇపుడు తెలంగాణ దగ్గరున్నది. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించకపోతే బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవు. అందుకనే కృష్ణా జలాల పేరుతో గోల మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబునాయుడు ఒకటే అన్నభావనను జనాల్లోకి ఎక్కించేందుకు తెగప్రయత్నిస్తోంది. దీనివల్ల తెలంగాణ పరిపాలనంతా చంద్రబాబు చేతిలోనే ఉందనేట్లుగా జనాల్లో అనుమానాలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబు, రేవంత్ పైన జనాల్లో వ్యతిరేకత రాజేయటం ద్వారా లాభపడాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు అర్ధమవుతోంది.

బిగ్ షాకిచ్చిన కవిత

బీఆర్ఎస్ అగ్రనేతలకు సడెన్ గా మరో తలనొప్పి మొదలైంది. అదేమిటంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ తదితరులకు కల్వకుంట్ల కవిత బిగ్ షాకిచ్చారు. సోమవారం శాసనమండలిలో మాట్లాడిన కవిత బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని, ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగాయనే చాలా ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు హరీష్ కేంద్రంగా మాత్రమే ఆరోపణలు చేస్తున్న కవిత తాజాగా కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా పాలనలో అవకతవకలు, అవినీతి జరిగిందని చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. రేవంత్, మంత్రుల ఆరోపణలనే సరిగా సమర్ధించుకోలేక నానా అవస్తలు పడుతున్న కేటీఆర్, హరీష్ తమపై కవితచేసిన ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేసీఆర్ పాలనపైన ముఖ్యంగా కేటీఆర్, హరీష్ అవినీతిపైన కవిత చేస్తున్న ఆరోపణలనే రేవంత్, మంత్రులు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఒకవైపు రేవంత్, మంత్రుల ఆరోపణలు, మరోవైపు కవిత చెబుతున్న బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ఎలా సమాధానం చెప్పాలో తెలీక బీఆర్ఎస్ అగ్రనేతలు తలలుపట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు ఏ మేరకు మున్సిపల్ ఎన్నికల్లో వర్కవుటవుతాయో చూడాల్సిందే.

కుటుంబం మొత్తం అవినీతే : కూరపాటి

అధికారంలో ఉన్న మిగిలిన పార్టీలతో పోల్చితే బీఆర్ఎస్ అవినీతి ఎక్కువగా చేసింది అని వెంకటనారాయణ అన్నారు. బీఆర్ఎస్ సెంటిమెంటు రాజకీయాలపై కాకతీయ యూనివర్సిటి పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపాటి వెంకటనారాయణ తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘కార్పొరేట్ సంస్ధలతో పాలకులు కుమ్మక్కవ్వటం వల్లే అవినీతి పెరిగిపోతోంది’’ అని ఆరోపించారు. ‘‘అవినీతి చంద్రబాబునాయుడు పాలనలోనే బాగా పెరిగిపోయింది’’ అని అన్నారు. ‘‘విద్యా, వైద్య రంగాలను చంద్రబాబు నాశనంచేశారు’’ అని మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్నపుడు అన్నీరకాల అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబం ఇపుడు ప్రజలను పిచ్చివాళ్ళను చేస్తున్నది’’ అని అన్నారు. ‘‘కేసీఆర్ పాలనలోని అవినీతిపై కవిత చేస్తున్న ఆరోపణల్లో కొత్తేమీలేదు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘బీఆర్ఎస్ పాలనంతా అవినీతి మయమైపోయిందని చాలామంది ఎప్పటినుండో చెబుతున్నదే’’ అని గుర్తుచేశారు.

‘‘ఆస్తుల పంపిణీ కాదని కవిత చెప్పినా, ముగ్గురు మధ్యా ఆధిపత్య యుద్ధం జరుగుతోందని, తెలెంగాణను కేసీఆర్ ఆస్తిగా కవిత చూస్తున్నది’’ అని కూరపాటి ఎద్దేవాచేశారు. మేనల్లుడు హరీష్ రావు కొల్లగొట్టే ప్రయత్నాలు నచ్చకే కవిత గొడవలు మొదలుపెట్టి పార్టీలో నుండి బయటకు వచ్చేసింది’’ అని అన్నారు. ‘‘ఆధిపత్యం, అక్రమసంపాదన దగ్గర అన్నా లేడు, బావ లేడని డిసైడ్ అయిన తర్వాతే కవిత ఆధిపత్య గొడవలతో బయటపడింది’’ అని చెప్పారు. ‘‘వీళ్ళవల్ల ఆధిపత్య పోరువల్ల ప్రజలకు ఉపయోగపడేది ఏమీలేదు’’ అని అన్నారు. ‘‘అబద్ధాలు చెప్పటంలో కేసీఆర్, కవిత మధ్య తేడాలేదు’’ అని సెటైర్లు వేశారు. ‘‘కేసీఆర్ ప్రేరణతోనే, తెలిసే శాసనమండలిలో కవిత ఆరోపణలు చేసినట్లుంది’’ అని అనుమానం వ్యక్తంచేశారు. కొడుకు, మేనల్లుడిపైన కేసీఆర్ కు నమ్మకంలేనట్లుంది అందుకనే కవిత ద్వారా ఇద్దరిపైనా ఆరోపణలు చేయిస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘అందుకనే కవిత ధైర్యంగా కేసీఆర్ పైన కూడా ఆరోపణలు చేయగలిగింది’’ అని అన్నారు. కాంగ్రెస్ తో ఐదు సీట్లు తీసుకుని పొత్తుపెట్టుకుంటుంది’’ అని కూరపాటి చెప్పారు. ‘‘బీఆర్ఎస్ కు ఎప్పుడు సమస్యలు ఎదురైనా వెంటనే సెంటిమెంటును రాజేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే’’ అని కూరపాటి స్పష్టంచేశారు.

Read More
Next Story