టీఎంసీ ఒంటరిపోరుకు సిద్ధమవుతుందా?
x

టీఎంసీ ఒంటరిపోరుకు సిద్ధమవుతుందా?

ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కిరాలేదు. ఏకాభిప్రాయం కుదరకపోతే ఒంటరిపోరుకు సై అంటున్న నేతలెవరు?


లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యాయి. ఇండియా కూటమి భాగస్వామి టీఎంసీ కాంగ్రెస్‌తో పొత్తుపై ఆచితూచి అడుగులేస్తుంది. సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయానికి రాలేదు.

సీట్‌ ‌షేరింగ్‌పై ఏకాభిప్రాయం కుదరగపోతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు సుదీప్‌ ‌బందోపాధ్యాయ పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటు గురించి కాంగ్రెస్‌ ‌నాయకులు ఏం ఆలోచిస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. తుది నిర్ణయం రెండు పార్టీల అగ్రనేతలు తీసుకుంటారని చెప్పారు.

‘‘కాంగ్రెస్‌తో సత్సంబంధాలున్నాయని మా అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఇదివరకే చెప్పారు. రెండు పార్టీల మధ్య పశ్చిమ బెంగాల్‌లో పొత్తు ఉండాలా? వద్దా? అనేది సోనియా గాంధీ, మమతా బెనర్జీ నిర్ణయిస్తారు. స్థానిక నాయకుల మాటలకు పట్టించుకోనవసరం లేదు.’’ అని చెప్పారు.

అసలు రంజన్‌ ‌చౌదరి ఏమన్నారు?

టీఎంసీ నుంచి తాము సీట్లు అడుక్కోమని కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్‌ ‌రంజన్‌ ‌చౌదరి రెండు రోజుల క్రితం కామెంట్‌ ‌చేశారు. ఈ అంశంపై మాట్లాడే అధికారం తనకు లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో సీనియర్‌ ‌టీఎంసీ నాయకుడు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పార్టీ పొత్తుకు సిద్ధంగా ఉందని, అయితే అదే సమయంలో అవసరమైతే ఒంటరిగా వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉందని మాత్రం చెప్పారు.

రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిని కాంగ్రెస్‌కు వదిలేసే అవకాశం ఉందని కొందరు టీఎంసీ నేతలంటున్నారు.

2019 ఎన్నికల్లో టీఎంసీ 22, కాంగ్రెస్‌ 2, ‌బీజేపీ 18 సీట్లు గెలుచుకున్నాయి. లోక్‌సభలో కాంగ్రెస్‌ ‌నాయకుడు కూడా చౌదరి ముర్షిదాబాద్‌ ‌జిల్లాలోని బహరంపూర్‌ ‌సీటును గెలుచుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి అబూ హసేం ఖాన్‌ ‌చౌదరి పొరుగున ఉన్న మాల్దా జిల్లాలోని మల్దహా దక్షిణ్‌ ‌స్థానం నుంచి వరుసగా మూడో సారి విజయం సాధించారు.

పొత్తుపై మమత ఏమన్నారు?

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, కాంగ్రెస్‌, ‌వామపక్షాల మధ్య పొత్తును టీఎంసీ చీఫ్‌ ‌మమతా బెనర్జీ తొలుత అంగీకరించారు. తమ ప్రధాన ప్రత్యర్థి, కాంగ్రెస్‌ ‌నాయకుల మాటల కారణంగా పొత్తును వెంటనే ఉపసంహరించుకున్నారు. ఆ రెండు పార్టీలు బీజేపీతో చేతులు కలిపాయని మమతా ఆరోపించారు.

టీఎంసీ అంతకుముందు 2001 అసెంబ్లీ ఎన్నికలు, 2009 లోక్‌సభ ఎన్నికలు, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని వారు 34 సంవత్సరాల సీపీఐ (ఎం) ప్రభుత్వాన్ని కూల్చివేశారు.

Read More
Next Story