మన పుష్పక విమానం.. గాల్లోంచి నేలపైకి దిగ్విజయంగా..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరోసారి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఉపగ్రహాలను కక్ష్యలోకి పెట్టే రియూజబుల్ లాంఛ్ వెహికల్ పరీక్షను శుక్రవారం ఉదయం విజయవంతంగా..
అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించింది. అంతరిక్షంలో ఇప్పుడు ఉపయోగిస్తున్న వాహక నౌకలకు బదులు రీయూజబుల్ లాంచ్ వెహికల్( ఆర్ఎల్వీ, దీనిపేరు ఫుష్పక్) ల్యాండింగ్ ప్రయోగాన్ని ఇస్రో దిగ్విజయంగా చేపట్టింది. కర్నాటలోని చలాకిరేలోని డిఫెన్స్ ఎయిర్ ఫీల్డ్ లో దీనిని దిగ్విజయంగా పరీక్షించారు. ఇది పుష్పక్ కు నిర్వహించిన మూడో పరీక్ష.
"పుష్పక్ లాంచ్ వెహికల్ అంతరిక్షాన్ని అత్యంత చవకైనదిగా చేయడానికి దేశం చేసే సాహసోపేతమైన ప్రయత్నం" అని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ మీడియాకు తెలిపారు.
"దేశంలో భవిష్యత్తు పునర్వినియోగ ప్రయోగ వాహనం, ఇది ఒకసారి ఉపగ్రహాలను కక్ష్యలోకి తిరిగి ప్రయోగించిన తరువాత భూమికి వస్తుంది. తరువాత మరోసారి అంతరిక్ష ప్రయోగాలకు అనువుగా ఉంటుంది. అలాగే కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలకు ఇంధనం నింపడం, ఏదైన లోపాలు ఉంటే తిరిగి ఉపగ్రహాన్ని నేలకు దించుతుంది. భారతదేశం నుంచి ఉత్పత్తి అయ్యే అంతరిక్ష వ్యర్థాలను కూడా తగ్గించగలదు” అని సోమ్ నాథ్ అన్నారు. రామాయణంలో ఫుష్పకం ప్రస్తావన వస్తుంది. ఇది సంపదకు అధిపతి అయిన కుబేరుడి వాహనం. భారతదేశంలో ఇది విజయవంతమైతే అలాగే డబ్బు కూరుతుందని ఇస్రో చైర్మన్ అన్నారు.
తొలిసారి పరీక్ష..
ఆర్‌ఎల్‌వి తొలిసారిగా 2016లో శ్రీహరికోట నుంచి వెళ్లి బంగాళాఖాతంలోని వర్చువల్ రన్‌వేపై విజయవంతంగా దిగింది. అయితే అది అనుకున్నంతగా విజయవంతం కాలేదు. దీని రెండో పరీక్ష ఏప్రిల్ 2, 2023న, చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్‌లో చేశారు. ఇందులో మెరుగైన ఫలితాలు వచ్చాయి. భారత వైమానిక దళం (IAF) చినూక్ హెలికాప్టర్ ద్వారా గాలిలోకి ఎగురవేశారు. ఇది 4.5 కిలోమీటర్ల ఎత్తులో జరిగింది. ల్యాండింగ్ జరిగే సమయంలో అవాంతరాలు ఎదురైనా వాటిని ఎదుర్కోని పుష్పక్ విజయవంతంగా ల్యాండింగ్ అయింది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభుత్వం రూ. 100 కోట్లకు పైగా కేటాయించింది.
Next Story