Kandula Jahnavi
x

జాహ్నవి కందులా ప్రమాదం: నిమిషాల వారీ టైమ్‌లైన్

2023 జనవరి 23 రాత్రి సియాటిల్‌లో జరిగిన ఘటన క్రమం, వేగం వివరాలు, బాడీ క్యామ్ వివాదం, తరువాతి చట్టపరమైన చర్యల సమగ్ర నివేదిక.


అమెరికాలోని సియాటిల్‌లో పోలీసు కారు ఢీకొట్టి మరణించిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి. ఈ ప్రమాదానికి సంబంధించి జాహ్నవి కుటుంబానికి సియాటిల్ ప్రభుత్వం 29 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.262 కోట్లు పరిహారంగా చెల్లించారు. ఈ వార్త ప్రమాదం జరిగినప్పుడు, ఇప్పుడు పరిహారం ఇచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జనవరి 23, 2023న సియాటిల్‌లో ఏం జరిగింది? కందుల జాహ్నవి ఎవరు? అన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

కందుల జాహ్నవి ఎవరు?

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన యువతి కందుల జాహ్నవి. ఇండియాలోని నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ సీటల్‌ క్యాంపస్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం ఆమె అమెరికాకు వెళ్లి సియాటిల్‌లో తన విద్యను కొనసాగిస్తోంది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ కోర్సు చేస్తున్న జాహ్నవి.. 2023 జనవరి 23న పోలీసు వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విషయంలో జాహ్నవి కుటుంబీకులు న్యాయపోరాటానికి దిగారు. మూడు సంవత్సరాల పాటు సాగిన ఈ పోరాటంలో ఎట్టకులకు జాహ్నవి కుటుంబం గెలిచింది. ఫిబ్రవరి 2026లో జాహ్నవి మరణానికి బాధ్యత వహిస్తూ సియాటిల్ ప్రభుత్వం పరిహారం అందించింది.

ఈ క్రమంలోనే సియాటిల్‌లో జరిగిన జాహ్నవి కందులా రోడ్డు ప్రమాదం మళ్లీ చర్చకు వచ్చింది. బాడీ క్యామ్ వీడియోలు, దర్యాప్తు నివేదికలు వెలుగులోకి రావడంతో ఆ రాత్రి ఏం జరిగిందనే ప్రశ్నలకు సమాధానాలు బయటపడ్డాయి. అసలు 2023 జవరి 23న ఏం జరిగిందంటే..

అత్యవసర కాల్‌తో ప్రారంభమైన ఘటన

2023 జనవరి 23 రాత్రి 7:58 గంటలకు సియాటిల్ పోలీస్ విభాగానికి ఓ అత్యవసర కాల్ వచ్చింది. ఒక వ్యక్తికి డ్రగ్స్ ఓవర్‌డోస్ అయ్యిందని సమాచారం అందింది. డ్యూటీలో ఉన్న అధికారి కెవిన్ డేవ్ తన పట్రోలింగ్ వాహనంతో అక్కడికి బయలుదేరారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో వేగ పరిమితి గంటకు 25 మైళ్లు మాత్రమే. అయితే దర్యాప్తు ప్రకారం అధికారి వాహనాన్ని సుమారు 74 మైళ్ల వేగంతో నడిపారు. సైరన్ నిరంతరం కాకుండా మధ్య మధ్యలో మాత్రమే మోగించారని నివేదికలు సూచించాయి.

రోడ్డు దాటుతున్న జాహ్నవి

సుమారు రాత్రి 8 గంటల సమయంలో డెక్స్టర్ అవెన్యూ నార్త్ – థామస్ స్ట్రీట్ కూడలి వద్ద జాహ్నవి గుర్తించిన క్రాస్‌వాక్ ద్వారా రహదారి దాటుతున్నారు. ఆమె యూనివర్సిటీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో అతివేగంతో వస్తున్న పోలీసు వాహనం ఆమె దిశగా చేరుకుంది.

వాహనం ఢీకొట్టడంతో జాహ్నవి గాల్లోకి ఎగిరి సుమారు 100 అడుగుల దూరంలో పడిపోయినట్లు రికార్డులు సూచించాయి. ఢీకొట్టే ముందు క్షణాల్లో బ్రేక్ వేశారని, అప్పటికీ వాహనం వేగం 63 మైళ్లుగా ఉన్నట్లు దర్యాప్తు వివరించింది. తీవ్ర గాయాలతో ఆమెను అత్యవసర సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె మరణించినట్లు ప్రకటించారు.

బాడీ క్యామ్ వివాదం

ప్రమాదం తర్వాత అక్కడికి చేరుకున్న మరో సీనియర్ అధికారి డేనియల్ ఆడరర్ ఫోన్ సంభాషణ బాడీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ సంభాషణలో ఆయన నవ్వుతూ మాట్లాడినట్లు బయటపడింది. బాధితురాలిపై అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆ రికార్డింగ్ వెల్లడించింది. ఈ వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో ఉన్న స్నేహితుల ద్వారా జాహ్నవి కుటుంబానికి ఘటన వివరాలు చేరాయి. చదువుతో ఉన్న కుమార్తెను కోల్పోయిన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.

తర్వాత ఏం జరిగిందంటే

సెప్టెంబర్ 2023లో కేసు మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంది. దర్యాప్తు నివేదికలు వేగం అంశాన్ని స్పష్టం చేశాయి. అనంతరం సంబంధిత అధికారిపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసు నమోదు చేసి జరిమానా విధించారు. తరువాత అతన్ని విధుల నుంచి తొలగించినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.

Read More
Next Story