‘జేడీ(యూ), బీజేపీ నేతలకు మానసిక ఆరోగ్యం బాగోలేదు’
x

‘జేడీ(యూ), బీజేపీ నేతలకు మానసిక ఆరోగ్యం బాగోలేదు’

జేడీ(యూ) చీఫ్‌ నితీష్‌ తిరిగి బీజేపీతో జతకట్టడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. బీహార్‌ సీఎం గురించి శివసేన ఎంపీ సంజయ్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఏమన్నారంటే..



బీహార్‌లోని మహాఘట్‌బంధన్‌ కూటమికి గుడ్‌బై చెప్పిన జేడీ(యూ) అధినేత నితీష్‌ కుమార్‌..ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీలో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో విలేఖరుల అడిగిన ప్రశ్నకు భారత కూటమిలో భాగస్వామి, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ నితీష్‌పై హాట్‌ కామెంట్స్‌ చేశారు.

‘‘మీకు వద్ద తప్పుడు సమాచారం ఉంది. భారత కూటమిలో ఏ పదవికి కూడా నితీష్‌ కుమార్‌ పేరును ప్రతిపాదించలేదు. ఈ ఇద్దరి (బీజేపీ,నితీష్‌ కుమార్‌)ల మానసిక స్థితి బాగోలేదు. రాజకీయ మైదానంలో ఇలాంటి ఆటలు ప్రమాదకరం’’ అని సమాధానమిచ్చారు.

ఇటీవల భారత కూటమి నేతల వర్చువల్‌ మీట్‌లో కన్వీనర్‌ పదవికి నితీష్‌ కుమార్‌ పేరును ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సూచించారని, పార్టీ ముఖ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసేటపుడు కన్వీనర్‌ నియామకం అవసరం లేదని కూడా చెప్పారని పవార్‌ వ్యాఖ్యలను రౌత్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

‘‘కబడ్డీ (దివంగత) బాలాసాహెబ్‌ ఠాక్రేకు ఇష్టమైన ఆట, శరద్‌ పవార్‌కు కూడా కబడ్డీ రెజ్లింగ్‌ క్రీడలలో నైపుణ్యం ఉంది. శివసేవ, ఎన్‌సీపీ కలిసి 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేసిన రౌత్‌ మరాఠా రిజర్వేషన్‌పై కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, కోటా నాయకుడు మనోజ్‌ జరాంగే ఇద్దరు కీలక వ్యక్తులని ప్రస్తుతం రిజర్వేషన్‌ అంశంపై అధ్యయనం సర్వే జరుగుతోందని చెప్పారు.

ప్రజలే బుద్ధి చెబుతాం : శరద్‌ పవార్‌

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ కూడా నితీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తరచుగా మారుతున్న విధేయత’’ రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.

15 రోజుల క్రితం వరకు ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం నితీష్‌ కృషి చేశారని, అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదన్నారు. విధేయతలను మార్చుకోవడంలో నితీష్‌ రికార్డు సృష్టించారని వ్యగ్యంగా అన్నారు పవార్‌. ‘‘గతంలో ఇలా జరగలేదు. ఇంతకుముందు హర్యానాలో ప్రసిద్ధి చెందింన ‘ఆయా రామ్‌, గయా రామ్‌’ పదాన్ని పవర్‌ ప్రయోగించారు.

మహాఘట్‌బంధన్‌, భారత కూటమితో తెగతెంపులు చేసుకున్న నితీష్‌ మళ్లీ బీజేపీ జతకట్టి తొమ్మిదోసారి బీహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

Read More
Next Story