బీహార్‌లో బలనిరూపణకు సిద్ధమవుతున్న జేడీ(యూ) చీఫ్ నితీష్
బీహార్‌లో మరోసారి బీజేపీతో జతకట్టిన జేడీ(యూ) చీఫ్ నితీష్‌కుమార్ బలనిరూపణకు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 10 న విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు.
బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం ఫిబ్రవరి 10న అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధమవుతోంది. శాసనసభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సంప్రదాయ ప్రసంగం తర్వాత బడ్జెట్ సమావేశాల మొదటి రోజునే ప్రభుత్వం విశ్వాస పరీక్షకు వెళ్లనున్నారు.
జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఆదివారం బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
స్పీకర్ పదవికి ఆర్జేడే ఎమ్మెల్యే అవధ్ బిహారీ చౌదరి ఇంకా రాజీనామా చేయలేదు. అయితే అసెంబ్లీ స్పీకర్ పదవిని బీజేపీ తన వద్దే ఉంచుకోనుందని సమాచారం. స్పీకర్ పదవికి నంద్ కిషోర్ యాదవ్, అమరేంద్ర ప్రతాప్ సింగ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.
గతంలో కాంగ్రెస్, ఆర్జేడీతో జతకట్టి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 18 నెలల తర్వాత తిరిగి ఆయన బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి కాబోతున్నారు. రికార్డుస్థాయిలో నితీష్ 9వసారి ముఖ్యమంత్రి కావడం విశేషం.
బలబలాలు చూస్తే..
జేడీ(యూ) ` 45, ఆర్జేడీ ` 79, బీజేపీకి ` 78, సీపీఐ (ఎంఎల్) ` 12, కాంగ్రెస్ `19, హెచ్‌ఏఎం ` 4, ఏఐఎంఐఎం ` 1, సీపీఐ(ఎం) ` 2, సీపీఐ ` 2, ఇండిపెండెంట్ ` 1
గుర్రుగా ఆర్జేడీ..
మహాఘట్‌బంధన్‌ను వీడి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నితీష్‌పై ఆర్జేడీ గుర్రుగా ఉంది. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ నితీష్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో నితీష్ కొత్త ప్రభుత్వానికి ఓటమి తప్పదని హెచ్చరించారు తేజస్వీ యాదవ్. తేజస్వీ ఇది వరకటి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.