
జీవన్ రెడ్డికి ముహూర్తం ఫిక్స్..
ఏప్రిల్ 20న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండవా కప్పుకోనున్న జీవన్ రెడ్డి.
జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. శుక్రవారం బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కలిశారు. అనంతరం కేసీఆర్, జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. కాగా జీవన్ రెడ్డిని పార్టీలోకి ఘనంగా స్వాగతించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆయన చేరిక సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 20న జీవన్ రెడ్డి అధికారికంగా గులాబీ కండవా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. అదే రోజున జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
Next Story

