బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జడ్జి.. ఎక్కడంటే..
x

బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జడ్జి.. ఎక్కడంటే..

తన స్టేట్ మెంట్ రికార్డు చేసే సమయంలో జడ్జి అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో ఆ న్యాయమూర్తిని బదిలీ చేసి, వెయిటింగ్ లిస్టులో ఉంచారు.


తన స్టేట్‌మెంట్ రికార్డు చేసే సమయంలో న్యాయమూర్తి తనను పట్టుకున్నాడని ఆరోపిస్తూ 27 ఏళ్ల అత్యాచార బాధితురాలు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదే విషయాన్ని మహిళ భర్త గతంలో ధలై జిల్లాలోని కమల్‌పూర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జికి ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురు సభ్యుల కమిటీ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని అగర్తలా హైకోర్టుకు బదిలీ చేసి, తదుపరి పోస్టింగ్ కోసం వేచి ఉండాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విశ్వజిత్ పాండే సూచించారు.

ధలై పోలీస్ సూపరింటెండెంట్ అవినాష్ రాయ్ మంగళవారం మాట్లాడుతూ.. "సోమవారం రాత్రి కమల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో న్యాయమూర్తిపై మాకు ఫిర్యాదు అందింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. విషయం సున్నితమైనది కావడంతో మా వాళ్లు చట్టపర చర్యల కోసం హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో నిందితుడిని హైకోర్టుకు బదిలీ చేసి వెయిటింగ్ లిస్టులో ఉంచారు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విశ్వజిత్ పాండే. ఆయన స్థానంలో సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మధుమితా బిశ్వాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Read More
Next Story