డీఎంకే లీడర్ కనిమొళి ఆస్తులెన్ని.. అప్పులెన్ని?
x

డీఎంకే లీడర్ కనిమొళి ఆస్తులెన్ని.. అప్పులెన్ని?

దక్షిణ తమిళనాడు నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేస్తున్న డిఎంకె ఎంపి కనిమొళి తన ఆస్తులను ప్రకటించారు.


దక్షిణ తమిళనాడు నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేస్తున్న డిఎంకె ఎంపి కనిమొళి తన ఆస్తులను ప్రకటించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మొత్తం రూ. 57 కోట్ల విలువ చేసే ఆస్తులు, అప్పులు రూ.60 లక్షలకు పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. చరాస్తులు విలువ రూ. 38. 77 కోట్లుకాగా, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌ఎస్‌తో సహా మూడు కార్లు ఉన్నాయని, వాటి విలువ రూ. 84.11 లక్షలకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. చెన్నైలోని నివాస ఆస్తులతో సహా ఆమె స్థిరాస్తుల విలువ రూ.18 కోట్లు, చేతిలో రూ.13,500 నగదు ఉన్నట్లు అఫిడవిట్‌లో రాశారు.

మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం కరుణానిధి కుమార్తె కనిమొళి 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన తమిళిసై సౌందరరాజన్‌పై 3.47 లక్షల ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. మరోసారి బరిలో నిలిచిన ఆమె కనిమొళి నామినేషన్ దాఖలు చేశారు.

కనిమొళి తనకు ఎలాంటి క్రిమినల్ కేసులో శిక్ష పడలేదని పేర్కొన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంలో ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 2017 డిసెంబర్‌లో ఆమెను నిర్దోషిగా ప్రకటించగా, ఢిల్లీ హైకోర్టు మార్చి 22, 2024న తన నిర్దోషిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ఏజెన్సీ చేసిన విజ్ఞప్తిని అంగీకరించిందని ఆమె అఫిడవిట్‌లో పేర్కొంది.

Read More
Next Story