కర్ణాటకలో ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సేవలు రద్దు..ఎందుకంటే..
x

కర్ణాటకలో ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సేవలు రద్దు..ఎందుకంటే..

ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సేవలను కర్ణాటకలో బ్యాన్ చేశారు.మహిళలకు సురక్షితం కాకపోవడం,ఎంవీఐ యాక్టును ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.


మహిళా దినోత్సవం రోజున కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సేవలను నిలిపివేసింది. మహిళలకు సురక్షితం కాకపోవడం, మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

‘‘కొన్ని యాప్‌ ఆధారిత ప్రైవేటు సంస్థలు మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రయాణానికి అనుకూలంగా లేని ఈ బైక్‌లను ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలుగా ఉపయోగిస్తున్నట్లు తేలింది. వీటి నుంచి పన్నులు వసూలుచేయడం కూడా కష్టంగా మారింది. ఎలక్ట్రిక్ బైకర్లతో ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు ఘర్షణ పడుతున్నసందర్భాలు కూడా ఉన్నాయి. శాంతి భద్రతలు, మహిళల రక్షణకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ప్రభుత్వం తమ నోటిఫికేషన్‌లో స్పష్టంచేసింది.

Read More
Next Story