కేసీఆర్ పాలనపై కవిత సంచలన ఆరోపణలు
x
KCR and Kavitha

కేసీఆర్ పాలనపై కవిత సంచలన ఆరోపణలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రధమ శతృవు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు సొంతబిడ్డ కల్వకుంట్ల కవితే


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రధమ శతృవు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు సొంతబిడ్డ కల్వకుంట్ల కవితే. నాగర్ కర్నూలు జనంబాటలో కవిత మాట్లాడుతు (BRS)బీఆర్ఎస్ హయాంలో లెక్కలేనంత అవినీతి జరిగిందని ఆరోపించారు. అప్పటి ఇరిగేషన్ శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు(Harish) నిర్వాకంతోనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పనిచేయాల్సిన ఐదుపంపుల్లో ఇప్పటికీ మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో (KCR)కేసీఆర్ అవినీతిపై (Revanth)రేవంత్, మంత్రులు ప్రత్యేకంగా ఆరోపణలు చేయాల్సిన పనిలేదు. అలాగే కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతికి ఆధారాలను చూపించటానికి కూడా పెద్దగా కష్టపడక్కర్లేదు. కూతురు కవిత(Kavitha) ఆరోపణలను చూపితే అవే ఆధారాలుగా పనికొస్తాయి. ఎందుకంటే తొమ్మిదిన్నరేళ్ళ కేసీఆర్ పాలనలో ఏమి జరిగిందో దగ్గరుండి స్వయంగా చూసిన బిడ్డే ప్రత్యక్షసాక్షి కదా. కాబట్టే కవిత ఆవినీతి ఆరోపణలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ సమాధానాలు చెప్పలేకపోతున్నారు.

కేసీఆర్ అవినీతిపై రేవంత్, మంత్రులు మాట్లాడుతుంటే కేటీఆర్, హరీష్ గొంతుపెట్టుకుని అంతెత్తున ఎగిరెగిరి పడుతున్నారు. మరి అవే ఆరోపణలను కవిత చేస్తుంటే ఎందుకని నోరెత్తలేకపోతున్నారు ? జిల్లాలోని కల్వకర్తిలో పాదయాత్రచేస్తున్న కవిత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన తర్వాతే కేసీఆర్ హయాంలో చాలా అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్ధ పాలమూరుపైన ఎందుకు చూపించలేదు అని కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూడా కేసీఆర్, హరీష్ సమాధానం చెప్పలేకపోతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల తరహాలోనే పనులు చేసుంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తయ్యేదని కవిత మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సకాలంలో పూర్తిచేయని కారణంగానే కృష్ణా జలాల్లో 90 టీఎంసీల నీటి వాటాపై హక్కులను కోల్పోయినట్లు ఆరోపించారు. కేసీఆర్, హరీష్ ముందు కవిత ఆరోపణలకు సమాధానాలు చెప్పి తర్వాత రేవంత్, మంత్రుల ఆరోపణలకు సమాధానాలు ఇస్తే బాగుంటుంది. కవితచేసిన ఆరోపణల ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 90 టీఎంసీల నీటి వాట హక్కులు పోవటానికి కేసీఆరే కారణమని అర్ధమవుతోంది. నీటి వాటా హక్కులను పొందటంలో అప్పటి బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ విఫలమైనట్లుగా ఆమె ధ్వజమెత్తారు.

పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పాలమూరు జిల్లాకు కృష్ణాజలాల్లో వినియోగంలో అన్యాయం జరిగిందని స్పష్టంగా ఆరోపించారు. కవిత తాజా ఆరోపణల ప్రకారం కృష్ణా జలాల వినియోగంలో, హక్కులను పొందటంలో కేసీఆర్ ప్రభుత్వం ఫెయిలైనట్లు అర్ధమవుతోంది. కేసీఆర్ వైఫల్యమే ఇపుడు రేవంత్ ప్రభుత్వం మెడకు చుట్టుకున్నది. తెలంగాణకు చేయాల్సినంత అన్యాయంచేసిన కేసీఆర్ ఎదురు రేవంత్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. 29వ తేదీ నుండి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఎవరి వాదన ఏమిటో ప్రజలే చూస్తారు కదా.

Read More
Next Story