‘మా దగ్గర చేతబడులు జరగవు’.. కర్ణాటక డిప్యూటీ సీఎంకు కేరళ మంత్రి కౌంటర్
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కేరళ ఉన్నతవిద్యాశాఖ, సోషల్ జస్టిస్ మంత్రి ఆర్ బిందు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన చెప్పినట్లు తమ రాష్ట్రంలో ఏమీ జరగవని..
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కేరళ ఉన్నతవిద్యాశాఖ, సోషల్ జస్టిస్ మంత్రి ఆర్ బిందు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన చెప్పినట్లు తమ రాష్ట్రంలో ఏమీ జరగవని తేల్చి చెప్పారు. ‘‘నాపైన, మా సీఎం సిద్దరామయ్య, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేరళలోని ఓ ఆలయంలో చేతబడి చేయించారు’’ అన్న డీకే శివకుమార్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళలో అలాంటి చేతబడులు జరగవని, ఇది వరకు కూడా జరగలేదని చెప్పారు.
‘‘దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాన్ని ఇటువంటి చీకటి కోణాల వైపుకు తీసుకెళ్లడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటి ఘటనలు మా రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయా అన్న అంశంపై ప్రత్యేక దృష్టి సారియంచాల్సిన అవసరం ఉంది’’ అని తన వ్యాఖ్యానించారు. దీంతో ఆమె వ్యాఖ్యలను విన్న నెటిజన్స్.. ‘‘ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి.. జరగవనీ మీరే అంటున్నారు. జరుగుతున్నాయేమో చూడాలంటారు. ఒకటి ఫిక్స్ కాండి’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
డీకే ఏమన్నారు
‘‘నేను, సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపైన కేరళలోని ఓ ఆలయంలో ‘శత్రు భైరవి యాగం’ లేదా ‘శత్రు సంహార యాగం’ చేయదలిచారు. వీటిలో ‘పంచ బలి’ అనే ఐదు రకాల బలులు ఉంటాయి. 21 మేకలు, మూడు గొడ్లు, 21 నల్ల గొర్రెలు, 5 పందులను బలి ఇస్తారు. ఈ యాగాల చేయడానికి అఘోరాలను కూడా కలుస్తున్నారు’’ అని డీకే చెప్పారు. కానీ ఆయన ఎవరు చేశారు అన్న విషయాలను వెల్లడించలేదు. కానీ కర్ణాటకలోకి కొన్ని రాజకీయ వ్యక్తులే ఈ చేతబడి చేయించాలని అనుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.