తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం
x
Tirumala Laddu Prasadm

తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ నియమాకం చెల్లదంటూ కేసు వేశారు


తిరుమల లడ్డూప్రసాదం వివాదంలో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ లాయర్ సుబ్రమణ్యంస్వామి సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు. ఏమని వేశారంటే లడ్డూ వివాదంపై విచారణ జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ నియమాకం చెల్లదంటూ కేసు వేశారు. తనపిటీషన్ లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సిట్, సీబీఐ, టీటీడీలను చేర్చారు. స్వామి దాఖలుచేసిన పిటీషన్ పరిశీలించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జాయ్ మాల్యాబాగ్చి సోమవారం విచారణ చేపట్టనున్నారు. స్వామి పిటీషన్ విచారణ సందర్భంగా సుప్రింకోర్టు ఏమి ఆదేశిస్తుందో చూడాలి.

లడ్డూ వివాదాన్ని ఎంత వీలుంటే అంతపెద్దది చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హిందువుల్లో దోషిగా నిలిపేందుకు చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. లడ్డూ ప్రసాదంలో గొడ్డుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిపారని చంద్రబాబు, డిప్యుటి సీఎం పవన్ కల్యాణ్ కొద్దిరోజులుగా జగన్ కు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే జంతుకొవ్వు కలిపినట్లు ఆధారాలు ఉన్నాయా అని గతంలోనే సుప్రింకోర్టు అడిగిన ప్రశ్నకు వీళ్ళు సమాధానం చెప్పలేదు. దాంతో దేవుడితో రాజకీయాలు చేయవద్దని మందలించింది. తర్వాత మరింత స్పష్టత కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను నియమించింది. సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి ప్రసాదంలో జంతుకొవ్వు కలిసింది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చింది.

ఆ తర్వాత సీబీఐ ఆధ్వర్యంలో సుప్రింకోర్టు మరోమారు దర్యాప్తు చేయించింది. సీబీఐ దర్యాప్తులో కూడా జంతుకొవ్వు కలిసినట్లుగా ఎక్కడా ఆధారాలు దొరకలేదు. అదే విషయాన్ని సీబీఐ తన రిపోర్టులో స్పష్టంచేసింది. దీన్ని అంగీకరించలేని చంద్రబాబు అండ్ కో కొద్దిరోజులు జగన్ కు వ్యతిరేకంగా ప్రతిరోజు ఆరోపణలు చేస్తు వివాదాన్ని సాగదీశారు. చివరకు మూడు రోజుల క్రితం దినేష్ కుమార్ తో ప్రత్యేకంగా ఏకసభ్య కమిషన్ ను నియమించింది. వివిధ అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వటానికి ప్రభుత్వం 45 రోజుల గడువిచ్చింది.

సిట్ విచారణ, సీబీఐ విచారణ జరిపిన తర్వాత కూడా చంద్రబాబు దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ నియమించటాన్ని సవాలు చేస్తు స్వామి పిటీషన్ వేశారు. సీట్, సీబీఐ విచారణల తర్వాత కూడా ఏకసభ్య కమిషన్ వేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఏమి వచ్చిందన్నదే స్వామి ప్రశ్న. మరి సుప్రింకోర్టు సోమవారం విచారణలో ఏమంటుందన్నది ఆసక్తిగా మారింది.

Read More
Next Story