ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఆర్‌సీబీ.. కన్నీటిని ఆపుకున్న ధోనీ
x

ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఆర్‌సీబీ.. కన్నీటిని ఆపుకున్న ధోనీ

ఐపీఎస్ 2024 మరింత రసవత్తరంగా మారింది. ప్రతి ఏడాది అనేక ఆశలతో మైదానంలోకి దిగి వేటిని నెరవేర్చుకోకుండా వెనుతిరిగే ఆర్సీబీ ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరింది.


ఐపీఎస్ 2024 మరింత రసవత్తరంగా మారింది. ప్రతి ఏడాది అనేక ఆశలతో మైదానంలోకి దిగి వేటిని నెరవేర్చుకోకుండా వెనుతిరిగే ఆర్సీబీ ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరింది. దీంతో ఈ ఏడాది కప్పు కొట్టగలమన్న నమ్మకం మరోసారి చిగురించినప్పటికీ. గతంలో ఎన్నోసార్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లి ఓడిపోయిన సందర్భాలు గుర్తు తెచ్చుకుని భయపడుతున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏది ఏమైనా శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

ఆ మ్చాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఐదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. అనంతరం 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే ఏడు వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేయగలింది. దీంతో 27 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్, ఆర్సీబీ స్థానం ఫిక్స్ అయిపోగా. రెండో ప్లేస్ కోసం రాజస్థాన్, సన్‌రైజర్స్ పోటీ పడుతున్నాయి.

ఉత్కంఠగా సాగిన ఆర్‌సీబీ మ్యాచ్

చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, సీఎస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఆఖరు వరకు కూడా నువ్వానేనా అన్నట్లు రెండు జట్లు ఆడాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇందులో ఉత్కంఠ ఏముందనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇందులోనే అసలు కిక్కు కూడా ఉంది. ఎందుకంటే ఆర్‌సీబీ, సీఎస్‌కే రెండు జట్లు ప్లేఆఫ్స్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. అయితే ప్లేఆఫ్స్‌కు చేరాలంటే సీఎస్‌కే జట్టుకు ఈ మ్యాచ్ గెలవాల్సిన అవసరం కూడా లేదు.

కానీ ఆర్సీబీకి అలా కాదు. ఆర్సీబీ కచ్ఛితంగా 17 అంతకన్నా ఎక్కువ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంది. అలా కాకుండా 17 అంతకన్నా తక్కువ పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించినా.. అది బూడిదలో పోసిన పన్నీరులా మారేది. ప్లేఆఫ్స్ బెర్స్ చెన్నైకి ఖరారు అయ్యేది. అలా కాకుండా ఉండటానికి ఆర్సీబీ.. ఆల్‌రౌండ్ షోతో చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది. ఎట్టకేలకు 27 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుని ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఓకే చేసుకుంది.

మార్మోగిన స్టేడియం

విజయం సాధించిన అనంతరం ఆర్సీబీ విజయో కేరింతలతో చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అభిమానులు అంతకుమించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగానే విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. అనడి కళ్లలో ఆనందబాష్పాలు స్పష్టంగా కనిపించాయి. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళుతుందని ఎవరూ అనుకోలేదు. చెప్పినా నమ్మలేదు.

కానీ చివరి ఆరు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించింది టాప్‌4లో నిలిచాం’’ అని చెప్పాడు. అయితే మరోవైపు జట్టును గెలిపించలేకపోయినందుకు ధోనీ మౌనంగా ఉండిపోయాడు. అతడి కంట కూడా కన్నీరు కనిపించింది. మరి ప్లేఆఫ్స్‌కు చేరిన ఆర్‌సీబీ ముందు ఫైనల్స్ చేరాలనే మరో పరీక్ష ఉంది. ఆ తర్వాత ఫైనల్స్ గెలిచి ఛాంపియన్ కావాలనే అసలు అగ్నిపరీక్ష ఉంటుంది. మరి వీటిలో ఆర్సీబీ ఏమాత్రం రాణిస్తుందో చూడాలి.

Read More
Next Story