బొగ్గు స్కామ్ పై దర్యాప్తు చేయించాలన్న కేటీఆర్
x
KTR and BRS leaders met Governor Jishnu Dev Varma

బొగ్గు స్కామ్ పై దర్యాప్తు చేయించాలన్న కేటీఆర్

కుంభకోణాన్ని బట్టబయలుచేశాక పాలకుల గుండెల్లోరైళ్ళు పరిగెడుతున్నాయని కేటీఆర్ అన్నారు


సింగరేణి బొగ్గు స్కామ్ పై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు సాయంత్రం లోక్ భవన్లో వీళ్ళంతా గవర్నర్ ను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన స్కామ్(Singareni Coal Scam) విధానాన్ని వివరించారు. తర్వాత (KTR)కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు, సింగరేణిలో దోపిడీ అంశంపై గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. స్కామ్ కు సంబంధించి తాము బయటపెట్టిన ఆధారాలతో కాంగ్రెస్ లో వణుకు మొదలైనట్లు చెప్పారు. కుంభకోణాన్ని బట్టబయలుచేశాక పాలకుల గుండెల్లోరైళ్ళు పరిగెడుతున్నాయని కేటీఆర్ అన్నారు.

జరిగిన కుంభకోణం నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అంటు సిట్ అధికారులు నానా హడావుడి చేస్తున్నట్లు ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే సిట్ అధికారులు విచారణ పేరుతో పార్టీలోని ఒక్కో నేతను పిలిపిస్తున్నట్లు మండిపడ్డారు. సీఎం అంటే రేవంత్ ను కోల్ మాఫియా నాయకుడిగా సింగరేణి కార్మికులు భావిస్తున్నట్లు ఎద్దేవాచేశారు. ఫుల్ బాల్ ఆటకు రు. 10 కోట్ల సింగరేణి నిధులను దుర్వినియోగంచేసినట్లు కేటీఆర్ ఆరోపించారు. ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనతో పారదర్శకతకు పాతరేసినట్లు ఆరోపించారు.

దేశంలో ఇంకెక్కడా లేని సైట్ విజిట్ నిబంధనను సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి, సీఎం బావమరిదేనా ? కాదా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్లందరినీ రింగ్ చేసి ప్రజాధనం దోపిడీకి ప్రయత్నిస్తున్నట్లు మండిపోయారు. ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని సింగరేణి కార్మికులు గుర్తించాలని అన్నారు.

Read More
Next Story