ఇండియాలో అయిదో సంపన్నరాలు ఈమె
x
Savitri Zindal (File)

ఇండియాలో అయిదో సంపన్నరాలు ఈమె

దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఆమె ఒకరు. ఇండియాలోని ధనవంతుల్లో ఆమెది ఐదో స్థానం. ఇంతకు ఎవరావిడా?


భారతదేశంలో ఐదో అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్‌(Savitri Jindal). గతేడాది తోటి భారతీయ బిలియనీర్‌లతో పోలిస్తే సంపదలో అత్యధిక వృద్ధిని సాధించారు. విప్రో అజీమ్‌ ప్రేమ్‌జీని నెట్టేసి ఐదో స్థానంలో నిలిచిందని బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ పేర్కొంది.

గతేడాది సావిత్రి జిందాల్‌ సంపద 9.6 బిలియన్‌ డాలర్లు పెరిగి 25 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. మరోవైపు, ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్‌ అంబానీ(Mukesh Ambani).. సంపదలో దాదాపు 5 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. అతని నికర సంపద ఇప్పుడు 92.3 బిలియన్‌ డాలర్లు. సావిత్రి గత రెండేళ్లలో 87 శాతం వృద్ధిని సాధించారు. సాఫ్ట్‌వేర్‌ మాగ్నెట్‌ ప్రేమ్‌జీ రెండేళ్ల క్రితం దేశంలో మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. అదే సమయంలో అతని నికర విలువలో 42 శాతం తగ్గుదల నమోదైంది. విప్రో వాటాలో 42 శాతం తగ్గుదల కారణంగా. అతని సంపద ఇప్పుడు దాదాపు 24 బిలియన్‌ డాలర్లు.

జిందాల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సావిత్రి. జిందాల్‌ స్టీల్‌, జిందాల్‌ పవర్‌, జిందాల్‌ ఎనర్జీ ఇలా ఎన్నో పరిశ్రమలకు అధినేత్రి. ఈమె భర్త హర్యానాకు చెందిన ఓపీ జిందాల్‌.

ఆయన మరణానంతరం గ్రూప్‌ కంపెనీల బాధ్యత సావిత్రి జిందాల్‌కు నలుగురు కొడుకులు ఉన్నారు.

అంబానీ తర్వాత రెండవ అత్యంత సంపన్న భారతీయుడిగా కొనసాగుతున్న గౌతమ్‌ అదానీ నికర విలువ 35.4 బిలియన్‌ డాలర్లకు పెరిగి 85.1 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

అయితే 78 ఏళ్ల ప్రేమ్‌జీ తన సంపద కంటే దాతృత్వం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. మే నెలలో ఒక నివేదిక ప్రకారం, అతను స్వచ్ఛంద సంస్థలకు బిలియన్లను విరాళంగా ఇచ్చాడు భారతదేశపు అగ్రశ్రేణి దాతృత్వవేత్తగా పేరు గడించారు.

Read More
Next Story