గుజరాత్‌ గిఫ్ట్‌సిటీలో మద్యం అమ్మకాలు ఇలా..
x

గుజరాత్‌ గిఫ్ట్‌సిటీలో మద్యం అమ్మకాలు ఇలా..

గుజరాత్‌ గిఫ్ట్‌ సిటిలో సందర్శకులకు మద్యం తాగేందుకు అనుమతిస్తారా? వైన్‌ అండ్‌ డైన్‌లో మద్యం అందించే వాళ్లకు అధికారులు ఎలాంటి గైడ్‌లైన్స్‌ జారీ చేశారు.


గాంధీనగర్‌లోని గిఫ్ట్‌ సిటీ (గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌-సిటీ) ప్రాంతాన్ని మద్యపాన నిషేధ చట్టం నుంచి మినహాయించారు. ‘‘గ్లోబల్‌ బిజినెస్‌ ఎకోసిస్టమ్‌’’ కోసం భూపేంద్ర పటేల్‌ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఎందుకీ నిర్ణయం..

గిఫ్ట్‌ సిటీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్లను ఆహ్వానించాలన్న లక్ష్యంతో గుజరాత్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులను ఆహ్వానించాలంటే ఇక్కడా గ్లోబల్‌ బిజినెస్‌ ఎకో సిస్టమ్‌ ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో విదేశాల నుంచి వచ్చే వారు, గిఫ్ట్‌సిటీలో పనిచేసే ఉద్యోగులు ఆల్కహాల్‌ తీసుకోవచ్చు.

కాగా గిఫ్ట్‌ సిటీలో మద్యంపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం గత వారం ప్రకటించింది. కొత్త విధానం ప్రకారం.. గిఫ్ట్‌ సిటీలో ఇప్పటికే ఉన్న, రాబోయే హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌ల్లో వైన్‌ అండ్‌ డైన్‌కు అనుమతి ఇస్తున్నారు.

పర్మిట్‌ హోల్డర్‌కు ఏ అర్హుతలుండాలి..

గిఫ్ట్‌ సిటీలో మద్యం యాక్సిస్‌ పర్మిట్‌ ఉన్న వారు మాత్రమే మద్యం అందించేందుకు అర్హులు. 21 సంవత్సరాలు పూరై గిఫ్ట్‌ సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులు, తాత్కాలిక సిబ్బందికి మాత్రమే ఈ పర్మిట్లు జారీ చేస్తారు. పర్మిట్‌ రెండేళ్ల వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత రెన్యూవల్‌ చేస్తారు. పర్మిట్‌ హోల్డర్‌ ఏడాదికి రూ. 1,000 చెల్లించాలి. ఒకవేళ గిఫ్ట్‌సిటీలోని కంపెనీ లేదా సంస్థలో ఉద్యోగం మానేస్తే, పర్మిట్‌ కూడా రద్దవుతుంది.

మద్యం అందించే వారి జాబితాను సంస్థ యూనిట్‌ హెడ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండ్‌కు పంపాలి. అక్కడ ఆమోదం పొందిన తర్వాతే మద్యం యాక్సెస్‌ పర్మిట్‌ కార్డులను మంజూరు చేస్తారు.

సందర్శకులకు తాత్కాలిక అనుమతి..

రాష్ట్ర హోం శాఖ శనివారం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. గిఫ్ట్‌ సిటీని సందర్శించే వ్యక్తి తాత్కాలిక అనుమతిని పొందవచ్చు. అది ఒక రోజుకు మాత్రమే జారీ చేస్తారు. మద్యం యాక్సెస్‌ ఉన్న ఉద్యోగి అతనిని వైన్‌ అండ్‌ డైన్‌ ప్రాంతానికి తీసుకెళ్తారు. సందర్శకులు అవసరమైనప్పుడు తాజా తాత్కాలిక అనుమతులను పొందవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మద్యం లైసెన్స్‌ పొందాలంటే..

గిఫ్ట్‌సిటీలో మద్యం లైసెన్స్‌ పొందాలనుకునే దుకాణదారుడు గాంధీనగర్‌లోని సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక, గిఫ్ట్‌ కమిటీ ఆమోదం మేరకు లైసెన్స్‌ జారీ చేస్తారు. ఆమోదం పొందిన వైన్‌ అండ్‌ డైన్‌ ప్రాంతంలోనే మద్యం అమ్మకాలు జరపాల్సి ఉంటుంది.

లైసెన్స్‌ను మొదట ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జారీ చేస్తారు. ఆపై ఒకేసారి ఐదేళ్లకోసారి రెన్యూవల్‌ చేసుకోవచ్చు.

లైసెన్స్‌కు ఏడాదికి రూ.లక్ష ఖర్చవుతుంది. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.2 లక్షలు చెల్లించాలి.

లైసెన్‌ పొందిన వారు రాష్ట్రంలో లేదా రాష్ట్రం వెలుపల నుంచి మద్యం కొనుగోలు చేయవచ్చు. పర్మిట్‌ హోల్డర్‌ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. గుజరాత్‌ నిషేధ చట్టం, 1949లోని నిబంధనలకు లోబడి ఉండాలి.

60ఏళ్ల తర్వాత మద్యం అమ్మకాలు..

1960లో మహారాష్ట్ర నుంచి గుజరాత్‌ విడిపోయి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. జాతిపిత మహాత్మ గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా దాదాపు 6 దశాబ్దాలుగా గుజరాత్‌లో మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. 60 ఏళ్ల తర్వాత ఈ నిబంధనను గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం సడలించింది.

మద్య పానీయాల తయారీ, నిల్వ, అమ్మకం వినియోగ నిషేధించే చట్టం గుజరాత్‌లో అమలులో ఉంది. చట్టం ప్రకారం మద్యం తాగికి వ్యక్తికి ఏడేళ్ల నుంచి 10 ఏళ్ల జైలుశిక్ష, బాధితుడు మరణిస్తే మరణశిక్ష విధిస్తారు.

Read More
Next Story