కర్ణాటకలో కొలిక్కి రాని బీజేపీ అభ్యర్థుల జాబితా..
x

కర్ణాటకలో కొలిక్కి రాని బీజేపీ అభ్యర్థుల జాబితా..

కర్నాటకలో బీజేపీ తరుపున బరిలో నిలిచే లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ఇంకా కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.


కర్నాటకలోని 28 లోక్‌సభ నియోజకవర్గాలలో ఏడింటికి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే బిజెపి తన అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఇంకా సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా మళ్లీ పని చేస్తుందన్న నమ్మకంతో ప్రతి బిజెపి నాయకుడు దక్షిణాది రాష్ట్రంలో పోటీ చేయడానికి టిక్కెట్ కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాషాయ పార్టీ కనీసం 10 లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటోంది.

ఆ జాబితాలో బీదర్, ఉడిపి-చిక్‌మగళూరు, ఉత్తర కన్నడ, హవేరి, మైసూరు, ధార్వాడ్, బెంగళూరు నార్త్, విజయపుర, బాగల్‌కోట్, కొప్పాల, తుమకూరు ఉన్నాయి.

బీజేపీలో అంతర్గత పోరు

ముఖ్యంగా చిక్కమగళూరు, తుమకూరులో పార్టీ నేతల మధ్య వర్గపోరు తెరపైకి వచ్చింది. ఉడిపి-చిక్‌మగళూరులో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి ప్రస్తుత ఎంపీ శోభా కరంద్లాజే పార్టీ కార్యకర్తల నుంచి "గో బ్యాక్" నినాదాలను ఎదుర్కొంటున్నారు. పార్టీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెపై ఉన్న ఆగ్రహం చల్లారలేదు.

మంత్రికి ప్రతిఘటన..

సీనియర్ నేత, బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే యడ్యూరప్ప మద్దతుతో కరంద్లాజే మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమంటున్నారు.

బెంగళూరు నార్త్ నుంచి కరంద్లాజే బరిలోకి దిగవచ్చని కొన్ని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సిట్టింగ్ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి డివి సదానంద గౌడ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. దాంతో ఇప్పుడు మళ్లీ బెంగళూరు నార్త్ నుంచి పోటీ చేసేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని కరంద్లాబే చెప్పారు.

ఇతర సమస్యాత్మక ఎంపీలు ఎవరంటే..

కరంద్లాజే ఫెడరల్‌తో మాట్లాడుతూ తనపై ఉన్న వ్యతిరేకత తనను లోక్‌సభ నుంచి దూరంగా ఉంచడంలో కుట్ర అని చెప్పారు. మైసూరు-కొడగు సీటులో ప్రస్తుత ప్రతాప్ సింహా పరిస్థితి కూడా అలాగే ఉంది. గతంలో మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణ దత్తా చామరాజ వడియార్‌ను పోటీకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సింహాకు మద్దతు ఇస్తున్నా.. ప్రస్తుత ఆయన స్థానంలో వడియార్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి.

బొమ్మై, ఈశ్వరప్ప..

జోషి సింహా స్థానానికి ప్రయత్నం చేస్తుండగా ... ఆయనకు ధార్వాడ నుంచి టిక్కెట్టు పొందే అవకాశం లేదని బిజెపి వర్గాల సమాచారం. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ జోషికి పోటీదారుడని భావిస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హవేరీ నియోజకవర్గం నుంచి తన కుమారుడు కేఈ కాంతేష్‌కు టికెట్‌ ఇవ్వాలని పార్టీ నేత కేఎస్‌ ఈశ్వరప్ప కోరడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. హవేరీలో బొమ్మై పేరు కూడా ప్రచారంలో ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. యడియూరప్ప తనతో పాటు ఢిల్లీకి రావాలని ఈశ్వరప్పను కోరినట్లు తెలిసింది. అయితే తన అభిప్రాయాన్ని ఇప్పటికే హైకమాండ్‌కు చెప్పడంతో ఆఫర్‌ను తిరస్కరించినట్లు ఫెడరల్‌తో చెప్పాడు.

హవేరి నుంచి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆరోగ్య కారణాలతో గత నాలుగేళ్లుగా 'క్రియారహితంగా' ఉన్న ఉత్తర కన్నడ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. కర్ణాటక మాజీ స్పీకర్ విశ్వేశర్ హెగ్డే కగేరి కూడా ఉత్తర కన్నడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని, తనకు సీనియర్ నేతల ఆశీస్సులు ఉన్నాయని పేర్కొన్నారు.

ఖుభా కష్టాలు

తుమకూరులో మాజీ మంత్రి వీ సోమన్న పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మరో పార్టీ నేత జేసీ మధుస్వామికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనకు దిగారు. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి భగవంత్ ఖుభా బీదర్‌లో సమస్యలతో సతమతమవుతున్నారు. ఔరాద్ ఎమ్మెల్యే పర్భు చౌహాన్ ఖుభా రీ నామినేషన్‌ను వ్యతిరేకించారు. బీదర్‌కు ప్రాతినిధ్యం వహించడానికి కొత్త ముఖాన్ని తీసుకురావాలని కోరారు.

బీజేపీ ముందున్న సవాళ్లివి. అభ్యర్థుల ఎంపికలో వారికి కాస్త తలనొప్పిగానే మారిందని చెప్పాలి. ఇంకొన్ని రోజులు గడిస్తే తప్ప అభ్యర్థుల ఎంపికలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read More
Next Story