గుజరాత్‌లో గల్లంతయిన ద్వారక ముస్లింల ఓట్లు
x

గుజరాత్‌లో గల్లంతయిన ద్వారక ముస్లింల ఓట్లు

గుజరాత్ లోక్‍సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ రేపు జరగనుంది. అయితే సౌరాష్ట్ర ప్రాంతం ద్వారకా జిల్లాకు చెందిన ముస్లిం మత్స్యకారులు ఓట్లు గల్లంతయ్యాయి.


గుజరాత్ లోక్‍సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ రేపు జరగనుంది. అయితే సౌరాష్ట్ర ప్రాంతంలోని ద్వారకా జిల్లాకు చెందిన ముస్లిం మత్స్యకారులు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ఓడరేవు విస్తరణ సమయంలో వారు నివసిస్తున్న గుడిసెలను కూల్చివేయడంతో గాంధ్వి, నవద్రా గ్రామాలకు చెందిన ముస్లిం మత్స్యకారుల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు. ఆ తర్వాత ఏడాది గడిచినా నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించలేదు. పరిహారం కోరుతూ గుజరాత్ హైకోర్టులో అనేక పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. దేవభూమి ద్వారకా జిల్లా పరిధిలోకి వచ్చే జామ్‌నగర్ నియోజకవర్గంలో కుటుంబాలు ఓటర్లుగా ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా ఓటు వేశారు.

గత సంవత్సరం ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన మత్స్యకారుడు యజుబ్ మూసా ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. “నాకు ఓటర్ స్లిప్ రాలేదు. నా పేరు, నా కుటుంబంలోని వాళ్ల పేరు ఉన్నారో లేదో తనిఖీ చేయడానికి వెళ్ళాను. కానీ మా పేర్లు లేవు. నేను 40 సంవత్సరాలుగా ఉంటున్న నా ఇంటిని పడగొట్టారు. గత 14 సంవత్సరాలుగా ఇక్కడ ఓటు వేస్తున్నాను." అని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితాలో పేరు కూడా లేకపోవడంతో మరో మత్స్యకారుడు మహమూద్ దావూద్ పటాలియా కూడా కలత చెందారు. "నేను ఇక్కడ నివాసం లేనందువల్ల ఓటు హక్కు లేదని అధికారులు చెప్పారని పేర్కొన్నారు.

వాస్తవానికి ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఓడరేవు విస్తరణ సమయంలో గాంధ్వి, నవద్రా గ్రామాల్లోని ముస్లిం మత్స్యకారుల ఇళ్లు నేలమట్టమయ్యాయి.ఇంతకు ముందు లోక్‌సభ లేదా విధానసభ ఎన్నికల్లో ఇలా జరగలేదని ఆయన అన్నారు.

CECకి లేఖ

ఈ విషయంపై గుజరాత్‌కు చెందిన మైనారిటీ హక్కుల సంస్థ మైనారిటీ కోఆర్డినేషన్ కమిటీ (ఎంసిసి) ఈ ఏడాది మే 3న ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసింది. నిర్వాసిత కుటుంబాలకు 'ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు హక్కు' కల్పించాలని లేఖలో కోరారు. అయితే అధికారుల నుంచి స్పందన లేదు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. సౌరాష్ట్రలోని ఐదు తీరప్రాంత జిల్లాల వెంబడి మత్స్యకారులు మొత్తం ఓటర్లలో 20 శాతం ఉన్నారు. మెజారిటీగా ఉన్న హిందూ మత్స్యకారులు OBC కమ్యూనిటీకి చెందినవారు. ఖార్వాలు విశ్వాసపాత్రమైన బిజెపి ఓటర్లు కాగా..ముస్లిం మత్స్యకారులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే.

Read More
Next Story