కేరళలో కమలం వికస్తిస్తుంది..రోడ్ షోలో మోదీ
x

కేరళలో కమలం వికస్తిస్తుంది..రోడ్ షోలో మోదీ

కేరళలోని పాలక్కాడ్‌లో ప్రధాని మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ఓపెన్ రూఫ్ వాహనంపై నిలుచుని రోడ్డుకు ఇరువైపుల కషాయ జెండాలు చేతబట్టిన జనానికి అభివాదం తెలిపారు.


కేరళలో బీజేపీని అడుగుపెట్టనివ్వకూడదని అధికార లెఫ్ట్ ఫ్రంట్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్‌ తెగేసి చెబుతున్నాయి. కాని ప్రధాని మోదీ మాత్రం ఈ సారి కేరళలో వికసిస్తుందని గ్యారంటీగా చెబుతున్నారు. అందుకేనెమో ఆయన కేరళలో పలుమార్లు పర్యటిస్తున్నారు.
తాజాగా మార్చి 19న కేరళలోని పాలక్కాడ్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. పూలతో అలంకరించిన ఓపెన్ రూఫ్ వాహనంపై నిలుచుని ఉదయం 10:45 గంటలకు రోడ్‌షోను ప్రారంభించారు. కొత్తమైదాన్ అంచువిలక్కు వద్ద ప్రారంభమైన రోడ్ షో పట్టణంలోని హెడ్ పోస్టాఫీసు వైపుగా సాగింది. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్, పాలక్కాడ్, పొన్నాని నియోజకవర్గాల ఎన్డీయే అభ్యర్థులు సి.కృష్ణకుమార్, నివేద సుబ్రమణియన్ ఉన్నారు.
మోదీ కీ జై అంటూ నినాదాలు..
ఎండలు మండిపోతున్నా జనం లెక్కచేయకుండా మోదీని చూసేందుకు రోడ్ల మీదకు చేరుకున్నాయి. పార్టీ జెండాలను, ప్లకార్డులను చేతబట్టి కనిపించారు. “మోదీ-మోదీ”, “భారత్ మాతాకీ జై”, “మోదీజీ స్వాగతం” “మోదీ కీ జై” అంటూ నినాదాలు చేశారు. కాషాయ రంగులో ఉన్న నెహ్రూ టోపీ ధరించిన మోదీపై జనం పూలవర్షం కురిపించారు. మోదీని చూసేందుకు చాలా మంది వ్యక్తులు తమ కుటుంబాలతో వచ్చారు. రోడ్ షో అనంతరం ప్రధానమంత్రి హెలిప్యాడ్‌ చేరుకున్నారు.
మూడు నెలల్లో ఐదో సారి..
కేరళలో పాగా వేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ కేరళలో పర్యటిస్తున్నారు. మూడు నెలల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించడం ఇది ఐదోసారి. ఇప్పటికే జనవరిలో రెండుసార్లు, ఫిబ్రవరిలో ఒకసారి, మార్చి 15న మరోసారి పర్యటించారు. మార్చి 15న పతనంతిట్ట పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ‘కేరళలో కమలం వికసించబోతోంది’ అని చెప్పారు. అవినీతి, అసమర్థతతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర ప్రజలు కష్టాలను చవిచూశారని అధికార లెఫ్ట్ ఫ్రంట్. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్‌పై దాడి చేశారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో పాలక్కాడ్ నియోజకవర్గంలో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో తమ అభ్యర్థి కృష్ణకుమార్ సి 21.24% సాధించారు.
Read More
Next Story