ఇంకా మండుతున్న మధిర కోల్డ్ స్టోరేజ్
x

ఇంకా మండుతున్న మధిర కోల్డ్ స్టోరేజ్

అగ్ని ప్రమాదం రెండో చాంబర్‌కు వ్యాపించి, మిర్చి నిల్వలపై రైతుల్లో ఆందోళన. అదనపు ఫైర్ సిబ్బంది చర్యలు కొనసాగుతున్నాయి.


మధిర మండలం ఆత్కూర్ గ్రామంలోని కోల్డ్ స్టోరేజ్‌లో చెలరేగిన అగ్ని ప్రమాదం ఇంకా అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మంటలు ఇప్పుడు రెండో చాంబర్‌కు కూడా వ్యాపించాయి. శనివారం ప్రారంభమైన ఈ అగ్ని ప్రమాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదట ఒక చాంబర్‌లో మంటలు చెలరేగగా, తరువాత అవి మరో చాంబర్‌కు విస్తరించినట్లు అధికారులు తెలిపారు. ఈ కోల్డ్ స్టోరేజ్‌లో భారీగా మిర్చి నిల్వలు ఉన్నాయని, అవి పూర్తిగా దగ్ధమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదనపు బలగాలను రంగంలోకి దించి చర్యలను వేగవంతం చేశారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి, స్కై ఫైర్ ఇంజిన్లను పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మంటలను పూర్తిగా ఆర్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పరిస్థితి ఎప్పుడు నియంత్రణలోకి వస్తుందో గమనించాల్సి ఉంది.

Read More
Next Story