Maha Kumbha Mela | కుంభమేళా తొలిరోజు ఫోటోలు
35 కోట్ల మంది భక్తులతో ఘనంగా ప్రారంభమైన మహా కుంభమేళ.(Maha Kumbha Mela)
13 జనవరి 2025 సోమవారం నాడు మహా కుంభమేళ మహోత్తరంగా ప్రారంభమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ కర్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి తొలి రోజు 35 కోట్ల మంది భక్తులు విచ్చేశారు. ప్రపంచంలో జరిగే అతిపెద్ద మతపరమైన వేడుక ఇదే కావడం విశేషం. ఏ వేడుకకు ఇంతటి సంఖ్యలో ఒకే మతానికి చెందిన వారు ఒక ప్రాంతానికి వచ్చి జరుపుకోవడం చాలా అరుదు. అటువంటిది భారతదేశంలో మాత్రం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళాను అత్యంత అట్టహాసంగా, ఆడంబరంగా జరుపుకుంటారు. ఈ కుంభమేళాను తమ పాలనలో జరపడాన్ని ప్రభుత్వాలు కూడా చాలా ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ కుంభమేళాకు ముందు జనవరి 11న 25లక్షల మంది నదీ స్నానం చేయడం ప్రపంచ రికార్డ్‌గా నిలిచింది. ఈ కుంభమేళా తొలిరోజు ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనమూ ఒక లుక్కేసేద్దామా..