మహారాష్ట్ర: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఎక్స్ ప్రెస్ రైలు
x

మహారాష్ట్ర: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఎక్స్ ప్రెస్ రైలు

పదుల సంఖ్యలో ప్రజలు మృతి?


మహారాష్ట్రలోని జల్గావ్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలపై నిలుచున్న ప్రయాణికులను ఢీ కొడుతూ ఎక్స్ ప్రెస్ రైలు వెళ్లడంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఎక్స్ ప్రెస్ రైలు స్టాప్ లేని ప్రాంతంలో కొంతమంది ప్రయాణికులు చైన్ లాగి కిందకు దిగి పట్టాలు దాటుతున్న సమయంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ వారిని ఢీ కొట్టింది.

దీనితో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందారు. దీనిపై ఇంకా వివరాలు అందాల్సి ఉంది. అయితే స్టాప్ లేని ప్రదేశంలో ఆపారా? లేక ఏదో సాంకేతిక సమస్యతతో రైలు ఆగడంతో ప్రయాణికులు ట్రాక్ పై నిలుచున్నారా అనే విషయంలో స్పష్టత లేదు.

కొంతమంది ప్రకారం.. రైలులో అగ్ని ప్రమాదం సంభవించిందనే పుకార్లు రావడంతో ప్రయాణికులు భయపడి పుష్పక్ ఎక్స్ ప్రెస్ చైన్ లాగి కిందకు దిగారని, అదే సమయంలో వేగంగా వచ్చిన కర్ణాటక ఎక్స్ ప్రెస్ వారిని ఢీ కొట్టిందని అంటున్నారు. దీనిపై ఇంకా రైల్వే శాఖ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

కానీ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story