మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య, కారణమేమిటో తెలుసా?
బాలివుడు నటుడు సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకను వేటాడిన కేసులో నిందితుడు. దానికి, ఇపుడు సిద్దిఖీ హత్యకు లింకు ఉందంటున్నారు. ఎలాగంటే...
మహారాష్ట్ర మాజీ మంత్రి, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ లీడర్ బాబా సిద్దిఖీ ( Baba Siddique) ముంబై నడిబొడ్డున దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై శనివారం రాత్రి కాల్పులు జరిపారు. దీంతో సిద్దిఖీని వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఎమర్జన్సీ కార్డియో వాస్క్యులార్ రీససిటషన్ అందిస్తూ చేశారు. అయితే, ఆయన రాత్రి 9.30 ప్రాంతంలో చనిపోయినట్లు తెలిసింది. ఆయన శరీరంలో మూడు బుల్లెట్లున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకటి నేరుగా ఛాతీలోనుంచి దూసుకుపోయింది. మరొక రిపోర్టు ప్రకారం ఆయన మీదకు ఆరు రౌండ్లు కాల్పలు జరిపారు. ఇందులో రెండు బుల్లెట్లు ఛాతీకి తగిలాయి.
శనివారం పొద్దు పోయాక కుమారుడు జీషన్ సిద్దిఖీ నివాసం ఎదుటే ఈ కాల్పులు జరిగాయి. జీషన్ బాంద్రా ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే. బాంద్రా వెస్టు నియోజకవర్గం నుంచి గతంలో బాబా మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో దాదాపు 48 సంవత్సరాలున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఎన్ సిపి లో చేరారు. తర్వాత ఆయన కుమారుడిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు.
ఈ దాడికి సంబంధించి ఒక ఇద్దరు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కర్నైల్ సింగ్ లనే వ్యక్తి హర్యానాకు చెందినవాడు. రెండో వ్యక్తి, ధర్మరాజ్ కాశ్యప్ ఉత్తర ప్రదేశ్ వ్కక్తి. దండగులు కాంట్రాక్ట్ కిల్లర్స్ అని అనుమానిస్తున్నారు. కాల్పుల్లో పాల్గొన్న మరొకవ్యక్తి కోసం పోలీసుల గాలిస్తున్నారు. సిద్దిఖీ మీద దాడి జరిగిందని తెలుసుకున్న బాలివుడ్ నటుడు సల్మాన్ రాత్రి లీలావతి ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు అతి సన్నిహితుడు బాబా సిద్ధిఖీ. ఈ దాడికి వాళ్లిద్దరి స్నేహానికి సంబంధం ఉందాఅనే కోణం నుంచి పోలీసులు కేసును విచారిస్తున్నారు. లారెన్స్ బిష్ణాయ్ అనే మాఫియా వర్గం ఈ దాడి వెనక ఉందని అనుకుంటున్నారు. బాబాసిద్ధిఖీ ఏమిటి, సల్మాన్ ఖాన్ ఏమిటి, ఎవరీ లారెన్స్ బిష్ణాయ్.
ఎందుకు బాబా సిద్ధికీ మీద దాడి జరిగింది.
1998 లో సల్మాన్ ఖాన్ బ్లాక్ బక్ (కృష్ణ జింక) వేటకేసులో ఇరుక్కున్నాడు. ఈ జంతువు రాజస్థాన్ ధార్ ఎడారిలో నివసించే బిష్ణాయ్ తెగవారికి ఆరాధ్యం. వాళ్లు ఈ జంతువునుంచే తమ జాతి ఉద్భవించిందని విశ్వసిస్తారు. ఈ జంతువుని పూర్వకాలం రాజులు, ఇపుడు సినిమా స్టార్లు వేటాడి ఆనందిస్తుంటారు. అందుకే రాజులన్నా సినిమా స్టార్లన్నఈ జాతి వాళ్లకు బాగా కోసం. ఇలాంటపుడు సల్మాన్ ఖాన్ బ్లాక్ బక్ ను వేటాడిన కేసులో ఇరుక్కున్నాడు, ఆ జాతి వైరాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇపుడు బాబా సిద్ధికీ మీద దాడి జరిపింది లారెన్స్ బిష్ణాయ్ అనే ఈ జాతి గ్యాంగ్ లీడర్ అని అనుమానం. ఎందుకంటే, లారెన్స్ బిష్ణాయ్ సన్నిహితుడయిన రోహిత్ గడోరా అనే వ్యక్తి ఆ మధ్య బ్లాక్ బక్ మీద దాడి చేసిన సల్మాన్ కు సన్నిహితులయిన వారిని కూడా చంపేస్తామని ఒక హుకుమ్ జారీ చేశాడు. లారెన్స్ బిష్ణాయ్ అనే వ్యక్తి ఒక పెద్ద వార్ లార్డ్ వంటి వాడు. అతను దాదాపు ఏడెనిమిది వందలమంది షూటర్లున్న ఒక గ్యాంగ్ ను తయారుచేసుకుని నేరాలకు పాల్పడుతున్నాడని, భారీగా వసూళ్లు చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు, సింగర్ రాపర్ సిద్ధు మూసే వాలా హత్య (2022)లో, ఢిల్లీలోని ఒక జిమ్ వోనర్ హత్యకేసులో కూడా లారెన్స్ బిష్ణాయ్ ముద్దాయి. ఇతను ఇపుడు గుజరాత్ జైలులో ఉన్నాడు. అయినా సరే, తన గ్యాంగ్ ద్వారా నేరాలను కొనసాగిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.
అయితే, బాబా సిద్దిఖీకి సల్మాన్ ఖాన్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల బిష్ణాయ్ ఆగ్రహానికి గురయ్యాడు. నిజానికి రెండు వారాలకిందట ఆయనకు బెదిరింప్ ఫోన్ కాల్స్ కూడా వచ్చాయని చెబుతున్నారు. అనంతరం ఆయనకు వై క్యాటగరి భద్రత కల్పించారు.
సిద్దిఖీ హత్య ముంబైలో తీవ్ర కలకలంరేపుతోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పాలనలో శాంతి భద్రతలు లోపించాయి. దీనికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ఎన్సీపీ, శివసేనలు డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ నేతను అది కూడా Y కేటగిరీ భద్రత కలిగిన లీడర్‌నే కాపాడలేకపోయారు ఇక సాధారణ ప్రజలను ఏం కాపాడతారని వారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈ హత్యను ఖండించారు.
The tragic demise of Baba Siddique ji is shocking and saddening. My thoughts are with his family in this difficult time.
— Rahul Gandhi (@RahulGandhi) October 13, 2024
This horrifying incident exposes the complete collapse of law and order in Maharashtra. The government must take responsibility, and justice must prevail.