అమెరికా వెళ్లాలనుకుంటున్నారా, వీసా  అప్‌డేట్స్‌ ఇవే..
x

అమెరికా వెళ్లాలనుకుంటున్నారా, వీసా అప్‌డేట్స్‌ ఇవే..

రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను మెరుగుపరచడం కోసం హెచ్‌ - 1బి దరఖాస్తులో కొన్ని మార్పులు చేసింది అమెరికా.. అవేంటో చదివేద్దాం..


భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకునే హెచ్‌ - 1బి వీసాల కోసం యూఎస్‌ పెద్ద మార్పులు చేస్తోంది. మోసాలను తగ్గించడం, రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌ - 1బి వీసా దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమై మార్చి 22న ముగుస్తుంది.

వీసా సాంకేతిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల కోసం విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతించే ఒక ప్రత్యేక వీసా. భారతదేశం, చైనా వంటి దేశాల నుంచి ఏటా వేలాది మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్‌ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. యూఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మార్పులేంటో చూద్దాం..

వీసా అంటే?

ఒక దేశ పౌరుడు/పౌరురాలు మరో దేశాన్ని సందర్శించాలంటే అనుమతి పత్రం కావాలి.ఆ అనుమతి పత్రాన్నే వీసా అంటారు. ఉదాహరణకు ఎవరైనా విదేశాలకు వెళ్లాలనుకుంటే ఆ దేశం నుంచి వీసా తీసుకోవాలి. వీసాల్లో చాలా రకాలున్నాయి. పర్యాటకులు, వ్యాపారులు, ఉద్యోగులు, కళాకారులు, క్రీడాకారులు ఇలా భిన్న వర్గాల వారికి భిన్నమైన వీసాలు ఉంటాయి.

హెచ్‌-1బీ వీసా ఏమిటి?

అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్‌-1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు.

2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌-1 బీ వీసా దరఖాస్తుల్లో కొన్ని మార్పులు చేసింది. కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయనుంది. వాటిని ఒక్కసారి పరిశీలిస్తే..

2025 ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ రిజిస్ట్రేషన్‌ వ్యవధి 2024 మార్చి 6 నుంచి ప్రారంభమై మార్చి 21 వరకు ఉంటుంది.దీనిని వీసా ఇన్షియల్‌ రిజిస్ట్రేషన్‌ పిరియడ్‌ అంటారు. ఈ స్వల్ప వ్యవధిలో సంస్థలు హెచ్‌ -1 బీ వీసా స్పాన్సర్‌ చేయాలనుకునే తమ ఉద్యోగులకు ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్లను సమర్పించాలి.

ఏటా కేవలం 65 వేల హెచ్‌-1బీ వీసాలను మాత్రమే యూఎస్‌ సిటిజెన్‌షిప్‌, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) జారీ చేస్తుంది.అమెరికాలో ఉన్నత విద్యనభ్యంసించిన 20 వేల మంది విదేశీ విద్యార్ధులకు ఈ వీసాలను అందజేస్తుంది.

ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం 2025లో సైతం నిబంధనలకు లోబడి 65 వేల హెచ్‌-1బీ వీసాలను జారీ చేస్తామని తెలిపింది. యూఎస్‌సీఐఎస్‌ విభాగం హెచ్‌-1 బీ వీసాల ధరఖాస్తుల స్వీకరణ అక్టోబర్‌ 1న (ఆర్ధిక సంవత్సరం) నుంచి చేపట్టనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30న ముగుస్తుంది.

అక్టోబర్‌ నుంచి హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను బలోపేతం చేస్తూ, మోసాలను తగ్గించేలా వీసా జారీలపై కొత్త నిబంధనలను అమలు చేయనుంది.

ఇక ఈ వీసాల కోసం ధరఖాస్తు సమయంలో అభ్యర్ధులు తప్పుడు ధృవీకరణ పత్రాలు లేదా చెల్లని డాక్యుమెంట్లను జత చేస్తే హెచ్‌-1బీ దరఖాస్తులను తిరస్కరించడం లేదా రద్దు చేస్తామని యూఎస్‌సీఐఎస్‌ అధికారులు సూచిస్తున్నారు.

ఈ ఏడాది ప్రత్యేకం హెచ్‌-1 బీ వీసా అప్లికేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఆర్గనైజేషనల్‌ అకౌంట్స్‌ విధానాన్ని ప్రారంభించనుంది. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థలోని ఉద్యోగులకు హెచ్‌-1 బీ వీసా అప్లికేషన్‌ను రూపొందించే ప్రక్రియలో ఆయా వ్యాపార సంస్థలు, న్యాయ సలహాదారులు ఈ అకౌంట్స్‌ ద్వారా సమన్వయం చేసుకునే వీలు లభిస్తుంది.

ఈ విధానం ద్వారా మరింత మెరుగైన సేవలు అందుతాయని, ఇది హెచ్‌ 1 బీ వీసా ఆన్‌ లైన్‌ అప్లికేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో ఒక ముందడుగుగా భావిస్తున్నామని యూఎస్సీఐఎస్‌ డైరెక్టర్‌ ఎం జాడౌ తెలిపారు.

Read More
Next Story