దేవుడి బొమ్మలు జనం కడుపునింపుతాయా? : ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే
x

దేవుడి బొమ్మలు జనం కడుపునింపుతాయా? : ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే

టీపీసీసీ సమావేశానికి విచ్చేసిని ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే బీజేపీపై విరుచుకుపడ్డారు. మోదీ, అమిత్‌షా గురించి ఇంకా ఏం మాట్లాడరంటే..


దేవుడి బొమ్మలు చూపించి ప్రజల కడుపు నింపలేరని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు.హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో గురువారం టీపీసీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనవరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర ప్రారంభోత్సవం గురించి ఖర్గే ప్రస్తావిస్తూ.. ‘‘దేవుని బొమ్మను చూపించి ప్రజల కడుపు నింపలేరని’’ వ్యాఖ్యానించారు. దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలపై పార్లమెంటులో నిలదీస్తామన్నారు. రెండు కోట్ల ఉద్యోగాల ఏమయ్యాయి? నల్లధనం వెనక్కు తెప్పించరా అని ప్రశ్నించారు.

త్వరలో మిగతావి అమల్లోకి..

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు హామీలలో రెండిరటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని, మిగతా వాటిని త్వరలో అమలు చేస్తామని చెప్పారు.

కష్టపడి పనిచేయాలి..

రెండు నెలల్లో పార్లమెంట్‌ ఎన్నికలు ఉన్నాయని, పోలింగ్‌ కేంద్రాల ఏజెంట్లు అత్యంత కీలకంగా పనిచేయాలని సూచించారు. క్యాడర్‌ గ్రామస్థాయిలో బలంగా పనిచేయాలన్నారు.

దాడులు చేయిస్తారు.. జాగ్రత్త..

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ ప్రభుత్వాలు కూలగొట్టేందుకు కుయుక్తులు పన్నుతారని ఖర్గే ఆరోపించారు. వారిద్దరూ కలిసి ఈడీ, సీబీఐ, ఐటీలతో దాడులు చేయించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నాయకులంతా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేసీఆర్‌ బీజేపీపై ఎప్పుడు ఆరోపణలు చేయలేదని..ఆయన బీజేపీకే మద్దతిస్తారని.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లను కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఓడిరచిందని.. లోక్‌సభ ఎన్నికల్లో వారిని ఓడిస్తామని తేల్చిచెప్పారు.

సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, కేసీ వేణుగోపాల్‌, దీపాదాస్‌ మున్షి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Read More
Next Story