మోదీ పాలన రావణాసురుడిని తలపిస్తుందన్న మమత
x

మోదీ పాలన రావణాసురుడిని తలపిస్తుందన్న మమత

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై ధ్వజమెత్తారు. మోదీ పాలన రావణాసురుడిని తలపిస్తుందన్నారు. ఎన్డీఎను ‘‘నియంతృత్వ కేంద్ర ప్రభుత్వం"గా అభివర్ణించారు.


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై ధ్వజమెత్తారు. మోదీ పాలన రావణాసురుడిని తలపిస్తుందన్నారు. ఎన్డీఎను ‘‘నియంతృత్వ కేంద్ర ప్రభుత్వం"గా అభివర్ణించిన టీఎంసీ చీఫ్.. అత్యంత క్రూరమైన, నియంతృత్వ కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చివేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఇక దేశానికి "ప్రజా ప్రభుత్వం" రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి ఈ రోజు (ఫిబ్రవరి 16) మమతా పంజాబ్ లో పర్యటించాల్సి ఉంది. అక్కడి స్వర్ణ దేవాలయంలో ప్రార్థనలు చేసేందుకు వెళ్లాలనుకున్నారు. అయితే రైతులకు సంఘీభావంగా తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

జైలులో పెట్టడం అంత సులువు కాదు..

కనీస మద్దతు ధర (MSP), రుణమాఫీ సహా ఇతర డిమాండ్లను ఆమోదించాలని ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమంలో భాగంగా .. పంజాబ్ నుంచి వందలాది మంది రైతులు పంజాబ్, హర్యానాలోని శంభు, ఖనౌరీ సరిహద్దుల వద్దకు తరలిరావడంతో రైతుల నిరసన దేశాన్ని ఆకర్షించింది. ‘‘భూమిని నమ్ముకుని పనిచేసే వారు భయపడవద్దు.. అందరినీ జైల్లో పెట్టడం అంత సులువు కాదు’’ అని అన్నారు మమత.

వివిధ అవినీతి కేసుల్లో టీఎంసీ నేతలు, మంత్రులను అరెస్టు చేసిన నేపథ్యంలో..సొంతంగా సీట్లు గెలవలేని కొన్ని స్థానాల్లో బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతుందని ఆరోపించారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..

నార్త్ దినాజ్‌పూర్‌లోని చోప్రాలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ కూలిపోవడం వల్ల నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన గురించి బెనర్జీ ప్రసంగించారు. ఈ విషాద మరణానికి సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కారణమని తృణమూల్ కాంగ్రెస్ ఇటీవల ఆరోపించింది. బాధ్యులైన బిఎస్‌ఎఫ్ సిబ్బందిపై కేంద్ర చర్యలు తీసుకోవాలని మమత డిమాండ్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని MGNREGA కార్మికులు, ఆవాస్ యోజన లబ్ధిదారులకు కేంద్రం నుండి రావాల్సిన ఆర్థిక బకాయిలపై బెనర్జీ మాట్లాడారు. 21 లక్షల మంది ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు ఫిబ్రవరి 21 నాటికి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చాను.

ఏప్రిల్‌లోగా 11 లక్షల మంది ఆవాస్ యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే, మే 1 నుంచి రాష్ట్రానికి నిధుల పంపిణీ ప్రారంభిస్తామని మమత చెప్పారు.

Read More
Next Story