
పంజాబ్‌కు టీఎంసీ చీఫ్ మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రివాల్, భగవంత్ మాన్‌లను కూడా కలిసే అవకాశం ఉంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 21న ఆమె అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఈ క్రమంలో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రివాల్, భగవంత్ మాన్‌లను కూడా మమతా కలిసే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం.
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) అగ్రనేతలతో మమతా భేటీ ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఇప్పటికే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన టీఎంసీ అధినేత్రి మరో కూటమి ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తమ డిమాండ్లకు పరిష్కరించాలంటూ ‘ఢిల్లీ చలో’కు సిద్ధమైన రైతులకు మమతా మద్దతు తెలిపారు. రైతులపై పోలీసుల దుష్చర్యలను ఆమె ఖండించారు.
Next Story