రేవంత్ భరోసాతో మేనకాగాంధీ హ్యాపీ
x
Revanth with Menaka Gandhi

రేవంత్ భరోసాతో మేనకాగాంధీ హ్యాపీ

మేనక ఆదివారం హైదరాబాదుకు వచ్చి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డితో భేటీఅయ్యారు


మేనకాగాంధి అంటే కొత్తగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరంలేని జంతుప్రేమికురాలు. దేశంలోని మూగజీవాల సంరక్షణకోసం నిరంతరం శ్రమిస్తుంటారు. ఇపుడు విషయం ఏమిటంటే మేనక ఆదివారం హైదరాబాదుకు వచ్చి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డితో భేటీఅయ్యారు. ఈమధ్యనే తెలంగాణలో కొన్ని కుక్కలకు విషమిచ్చి చంపేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగో గోసంరక్షణ సంఘం సభ్యులపైన కొందరు కాల్పులు జరిపిన ఘటన కూడా కలకలం రేపింది. ఈరోజు రేవంత్ భేటీలో మేనక ఆ విషయాలనే ప్రస్తావించారు.

మున్సిపాలిటీల పరిధుల్లోని వీదికుక్కల నిర్వహణ, గోసంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మేనకకు రేవంత్ వివరించారు. అలాగే వీధికుక్కులకు స్టెరిలైజేషన్ వివరాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గోసంరక్షణకు ప్రభుత్వంతీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణానికి శంకుస్ధాపన చేసినట్లు సీఎం చెప్పారు. అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా గోశాలల నిర్మాణాలకు రెడీచేస్తున్న ప్రణాళికలను కూడా తెలిపారు. జంతు సంరక్షణ విషయంలో ప్రభుత్వ చర్యలపై మేనకగాంధీ సంతృప్తి వ్యక్తంచేటమే కాకుండా రాష్ట్రప్రభుత్వ కృషిని అభినందించారు.

Read More
Next Story