ట్రంప్.. టారిఫ్ భయంతో మందగమనంలో మార్కెట్లు
షేక్ అయిన ఆసియా మార్కెట్లు, ఆర్బీఐ ఏం చేస్తుందో అని వేచి చూస్తున్న స్థానిక పెట్టుబడిదారులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా లపై వాణిజ్య యుద్దం ప్రారంభించడం, దానికి ఆయా దేశాలు సైతం ఢీ అనడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయి.
ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. భారత్ లోని ప్రారంభ ట్రేడింగ్ లో బీఎస్ఏఈ బెంచ్ మార్క్, సెన్సెక్స్ 731.91 పాయింట్లు పతనమై 76, 774. 05 చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 243 పాయింట్లు కోల్పోయి 23,239.15 వద్దకు చేరుకుంది.
ఇందులో లారెన్స్ అండ్ టూబ్రో, ఎటీపీసీ, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా సర్వీసెస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
లాభపడిన వాటిలో టైటాన్, మారుతీ, నెస్లే, బజాజ్, ఫిన్ సర్వే వంటి ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ భారీగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి.