పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన కేసులో అసలు సూత్రధారి అతడేనా?
x

పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన కేసులో అసలు సూత్రధారి అతడేనా?

పార్లమెంటు హాల్‌లోకి చొరబడి సభ్యులను భయాందోళనకు గురిచేసిన వారిలో అసలు సూత్రధారి ఎవరు? పోలీసులు నిందితులను గుజరాత్‌కు ఎందుకు తీసుకెళ్లారు?


పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులను గుజరాత్‌కు తీసుకెళ్లారు. అక్కడ పాలిగ్రాఫ్‌, నార్కో-అనాలిసిస్‌, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ పరీక్షలు చేయించి ఇటీవల ఢల్లీికి తీసుకువచ్చారు. డిసెంబరు 13న జరిగిన ఘటనకు సూత్రధారి లలిత్‌ రaా అని పోలీసులు గతంలో చెప్పారు. నార్కో, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ పరీక్షల్లో మనోరంజన్‌ అసలు ప్రధాన సూత్రధారి అని తేలిందని వారు చెబుతున్నారు.

నీలం మినహా ఐదుగురు నిందితులను డిసెంబర్‌ 8న గుజరాత్‌కు తీసుకెళ్లారు. సాగర్‌, మనోరంజన్‌ అదనపు నార్కో-ఎనాలిసిస్‌, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ పరీక్షలు కూడా చేయించుకున్నారు. అయితే పరీక్షలు చేయించుకోవడానికి నీలం అంగీకరించలేదు.

దాడి ఎందుకు చేశారు?

ప్రభుత్వానికి ఒక సందేశం పంపేదుకే నిందితులు ఇందంతా చేశారని ఇప్పటి వరకు జరిగిన పోలీసుల విచారణను బట్టి తెలుస్తుంది. నిరుద్యోగం, మణిపూర్‌ సంక్షోభం, రైతుల ఆందోళనలపై తాము కలత చెందామని నిందితులు వెల్లడిరచారని పోలీసులు చెబుతున్నారు. కాగా ఫోరెన్సిక్‌ నివేదికల అందిన తర్వాత మరికొంత మందిని ప్రశ్నించే అవకాశం ఉంది.

సాగర్‌ శర్మ, మనోరంజన్‌ డి జీరో అవర్‌ సమయంలో పబ్లిక్‌ గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు. పసుపు రంగులో ఉన్న డబ్బాల్లోని ఒకరకమైన గ్యాస్‌ను విడుదల చేసి నినాదాలు చేశారు. అదే సమయంలో మరో ఇద్దరు నిందితులు - షిండే, ఆజాద్‌ పార్లమెంటు వెలుపల ‘‘తనషాహీ నహీ చలేగీ’’ అని అరుస్తూ డబ్బాల నుంచి రంగు వాయువును స్ప్రే చేశారు.

Read More
Next Story