మక్కా మృతుల్లో ఎక్కువ మంది మల్లేపల్లి వాసులుగా అనుమానం
x

మక్కా మృతుల్లో ఎక్కువ మంది మల్లేపల్లి వాసులుగా అనుమానం

ప్రమాద స్థలానికి తరలి వెళ్లి సౌదీ సైన్యాధికారులు, పోలీసులు


మక్కా సమీపాన జరిగిన బస్సు ప్రమాదం గురించి కొద్దికొద్దిగా వివరాలు అందుతున్నాయి. అయితే అధికారికంగా కేంద్రం నుంచి గాని, రాష్ట్రం నుంచి గాని, సౌదీ ప్రభుత్వం నుంచి ప్రకటన వెల్లవడలేదు. అయితే, హైదరాబాద్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మృతుల్లో ఎక్కువ మంది నగరంలో మల్లే పల్లి ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. దీనికి సంబంధించి 16 మంది పేర్లు వినబడుతున్నాయి.

హైదరాబాద్‌ మల్లేపల్లి బజార్‌ ఘాట్‌కు చెందిన 16 మంది పేర్లు: రహీమున్నీసా, రహమత్‌ బీ, షెహనాజ్‌ బేగం, గౌసియా బేగం, కదీర్‌ మహ్మద్, మహ్మద్‌ మౌలానా, షోయబ్‌ మహ్మద్, సోహైల్‌ మహ్మద్, మస్తాన్‌ మహ్మద్, పర్వీన్‌ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్‌ బేగం, జహీన్‌ బేగం, మహ్మద్‌ మంజూరు, మహ్మద్‌ అలీగా గుర్తించినట్లు తెలిసింది. ఈకుటుంబాల గురించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి

సౌదీ అరేబియా లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్ కు చెందిన ఉమ్రా యాత్రికుల మృతి పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియా లో ఉన్న ఎన్నారై కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మృతులకు ప్రగడ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు డిప్యూటీ సీఎం సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

ప్రమాదం వివరాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఒక సమాచారం కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్రం వివరాలు:

వసుంధర , రెసిడెంట్ కమిషనర్ సెక్రటరీ: 98719 99044

సిహెచ్ చక్రవర్తి, పిఆర్ ఒ: 99583 22143

రక్షిత్ నయిన్,లయజన ఆఫీసర్ : 96437 23157.

ఇలాగే మృతుల గురించి సమాచారం అందించేందు భాతర కాన్సలేట్ జెద్దాలో ఒక సమాచారం కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ఫోన్ నెంబర్లు: 8002440003 (Toll free)

0122614093

0126614276

0556122301 (ఇది వాట్సాప్ నెంబర్)

బస్సులో 42 మంది ఉమ్రా యాత్రికులు ఉన్నారని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ కూడా చెప్పారు. తాను సౌదీ రాయబార కార్యాలయంతో సంప్రదిస్తున్నానని ఆయన చెప్పారు. ప్రమాదం మీద భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విచారం వ్యక్తం చేశారు.




Read More
Next Story