ఆధార్ ఉంటేనే రమ్మంటున్న కంగనా రనౌత్
x

ఆధార్ ఉంటేనే రమ్మంటున్న కంగనా రనౌత్

ఇటీవల లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన ఓ ఎంపీ తనను కలవాలంటే ఆధార్ కార్డు తీసుకురావాలని షరతు పెట్టారు. ఇంతకు ఎవరా ఎంపీ? ఏ నియోజకవర్గం?


బాలీవుడ్ నటీ, హిమాచల్ ప్రదేశ్ మండి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మళ్లీ వార్తలోకెక్కారు. తనను కలవాలనుకునేవారు ఆధార్ కార్డు తీసుకురావాలని, తన దృష్టికి తేవాలనుకున్న సమస్యను స్పష్టంగా కనపర్చాలని కండీషన్ పెట్టారు. నియోజకవర్గంలో సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి, వాటి పరిష్కారానకి కృషి చేస్తానన్నారు. గురువారం మండి సదర్ ప్రాంతంలో కొత్తగా జన్ సంవిద్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘నన్ను కలిసేందుకు ఆధార్ కార్డు అవసరం లేదు’

కంగనా పెట్టిన షరతులపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ స్పందిస్తూ.. ప్రజాప్రతినిధులను కలిసేందుకు తమ ఆధార్ కార్డులను తీసుకురావాలని కంగనా కోరడం సరికాదన్నారు. ప్రజలు తనను కలవాలనుకుంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా వచ్చి కలవవచ్చు. ఆధార్ కార్డు తేనవసరం లేదని చెప్పారు.

“మేము ప్రజాప్రతినిధులం. అన్ని వర్గాల ప్రజలను కలవడం మా బాధ్యత. చిన్నపని, పెద్ద పని అని తేడా లేదు. విధానపర విషయమైనా లేక వ్యక్తిగత విషయమయినా ప్రజలు ప్రజాప్రతినిధులను కలవవచ్చు. దానికి గుర్తింపు కార్డులు అవసరం లేదు.”అని విక్రమాదిత్య పేర్కొన్నారు.

Read More
Next Story