నెల్లూరు.. మచిలీపట్నం వద్ద తీరందాటనున్న ‘మిచౌంగ్’
x
india map

నెల్లూరు.. మచిలీపట్నం వద్ద తీరందాటనున్న ‘మిచౌంగ్’

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం వాయుగుండం గా బలపడింది. రాగల 48 గంటల్లో తుఫాన్ గా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.


నెల్లూరు, మచీలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని, తీరం వెంట 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది.మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లోద్దని పేర్కొంది. ప్రస్తుతం వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది మచిలీపట్నం నుంచి 970 కిలోమీటర్ల దూరం..బాపట్ల నుంచి 990 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.తుఫాన్ కు మయన్మార్ సూచించిన మిచౌంగ్ పేరును పెట్టారు.

తుఫాన్ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అలర్జ్ అయింది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని ముందస్తు చర్యలు ప్రారంభించింది. తుఫాన్ ప్రభావంతో డిసెంబర్ 2 నుంచి వర్షాలు ప్రారంభం అవుతాయని, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర కోస్తా కంటే దక్షిణ కోస్తా ఎక్కువ స్థాయిలో ప్రభావితం అవుతాయని, ఇక్కడే భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read More
Next Story