‘శక్తి’ని నాశనం చేయాలనుకుంటే... నాశనం తప్పదు: మోదీ
x

‘శక్తి’ని నాశనం చేయాలనుకుంటే... నాశనం తప్పదు: మోదీ

"శక్తిని అంతం చేయాలనుకునే వారు నాశనమవుతారు. అందుకు మన ఇతిహాసాలే నిదర్శనం’’ అని ప్రధాని మోదీ అన్నారు


కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన 'శక్తి' వ్యాఖ్యలపై మరోసారి విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. 'ఇండియా' కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, డీఎంకే హిందూ మతాన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. తమిళనాడులోని సేలంలో మంగళవారం మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
''మరియమ్మన్ ఇక్కడి శక్తి మాత. తమిళనాడులో కంచికామాక్షి శక్తి. మధురలో శక్తి మాత మధుర మీనాక్షి. ఆ శక్తిని ధ్వంసం చేస్తామని భారత కూటమి చెబుతోంది. శక్తి అంటే పవర్, తల్లి. ఆ శక్తిని ధ్వంసం చేస్తామని వారు చెబుతున్నారు. అదే వాళ్లను నాశనం చేస్తుంది.'' అని మోదీ అన్నారు.
నాణానికి రెండు ముఖాలు..
డీఎంకే, కాంగ్రెస్‌ ఒకే నాణానికి రెండు ముఖాల్లాంటివని మోదీ అభివర్ణించారు. ఒకటి అవినీతి, మరొకటి కుటుంబ పాలనకు నిదర్శనమని చెప్పారు.
జయలలితనూ వదల్లేదు..
మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితను కూడా డీఎంకే వదల్లేదని అన్నారు. జయలలిత బతికి ఉన్నప్పుడు ఆమె పట్ల డీఎంకే నేతలు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసునని, అదే డీఎంకే నిజస్వరూపమని తెలిపారు.
కాంగ్రెస్ ఎవరీని ఎదగనివ్వదు..
దివంగత కాంగ్రెస్ దిగ్గజం జికె మూపనార్‌కు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా "వంశపారంపర్య పార్టీలు" ఆ స్థాయికి చేరుకోనివ్వమని కాంగ్రెస్ పార్టీనుద్దేశించి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత కె.కామరాజ్‌ను గుర్తు చేసుకుంటూ.. ఆయన నిజాయితీ, మధ్యాహ్న భోజనం వంటి విప్లవాత్మక పథకాలు తనకు స్ఫూర్తినిచ్చాయని చెప్పారు.
బిల్లును వ్యతిరేకించారు..
‘మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. దీంతో తమిళనాడులో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. డిఎంకె ఈ మహిళా వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా ఏప్రిల్ 19న ఓటు వేయండి’’ అని మోదీ అన్నారు.
ఉద్వేగానికి లోనైన మోదీ..
తన ప్రసంగంలో మోడీ కాసేపు ఉద్వేగానికి లోనయ్యారు. 10 సంవత్సరాల క్రితం సేలం జిల్లాలో హత్యకు గురయిన బిజెపి కార్యకర్త 'ఆడిటర్' వి రమేష్ గుర్తు చేసుకుంటూ కొద్దిసేపు తన ప్రసంగాన్ని ఆపారు. పార్టీ కోసం రమేష్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
‘‘ఆడిటర్ రమేష్‌ని మర్చిపోలేను. దురదృష్టవశాత్తు ఈరోజు రమేష్ మన మధ్య లేడు. రమేష్ పార్టీ కోసం అహోరాత్రులు కష్టపడి మంచి వక్త. కానీ అతను హత్యకు గురయ్యాడు. ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తున్నా’ అని మోదీ అన్నారు.
Read More
Next Story