‘జూట్ ఔర్ లూట్’ అని ప్రధాని ఎవరినుద్దేశించి అన్నారు?
x

‘జూట్ ఔర్ లూట్’ అని ప్రధాని ఎవరినుద్దేశించి అన్నారు?

దేశంలో వారసత్వ రాజకీయాలను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నప్రధాని మోదీ.."రాజవంశ పార్టీలు ఒకదానికొకటి భిన్నంగా ఉండవచ్చు, కానీ వాటి స్వభావం మాత్రం ఒకటేనని చెప్పారు.


ప్రధాని మోదీ సోమవారం తెలంగాణలో పర్యటించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు పలు అభివద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

ఇటీవల ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ మోదీనుద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. “మోదీకి సొంత కుటుంబం లేకపోతే మేం ఏం చేస్తాం? రామ మందిరం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగని ఆయన నిజమైన హిందువు కూడా కాదు. కన్నవారు చనిపోతే కొడుకు తల, గడ్డం తీయాలి. ఇది హిందూ సంప్రదాయం. తల్లి చనిపోయినప్పుడు మోదీ అలా చేయలేదు.’’ అని లలూ అన్నారు.

లాలూ వ్యాఖ్యలకు మోదీ ధీటుగా సమాధానమిచ్చారు. “ఈ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబం. మేరా భారత్ మేరా పరివార్ హై (నా భారతదేశం నా కుటుంబం). దేశ ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేయాలన్న కలతో చిన్నతనంలో ఇల్లు వదిలి వచ్చాను' అని చెప్పారు.

వారసత్వ రాజకీయాలు గురించి మాట్లాడుతూ..

దేశంలో వారసత్వ రాజకీయాలను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్న మోదీ.. బీఆర్‌ఎస్‌కు గురించి మాట్లాడారు. "రాజవంశ పార్టీలు ఒకదానికొకటి భిన్నంగా ఉండవచ్చు, కానీ వాటి స్వభావం మాత్రం ఒకటేనని చెప్పారు. అబద్ధాలు చెబుతూ దోపిడీ చేయడం (జూట్ లూట్) ఆ పార్టీల నైజమని పేర్కొన్నారు.

దేశంలో గడచిన 15 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి గురించి ప్రధాని వివరించారు. 'ఆత్మనిర్భర్ భారత్'ను 'వికసిత్ భారత్'గా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

ఆదివాసీల సంక్షేమానికి తమ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అభివృద్ధి కోసం మోదీ హామీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఎన్‌టీపీసీకి పూర్తి సహకారం.. సీఎం రేవంత్

రాష్ట్రాభివృద్ధికి సహకరించిన ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. ప్రధాని పర్యటన సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ఎన్‌టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చిన రేవంత్ .. విభజన చట్టం ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉందని, అయితే గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దాదాపు రూ.6వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా మోదీ శంకుస్థాపన చేశారు. రామగుండం ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్ ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. అండర్‌ డ్రైనేజ్‌ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్‌- బేల- మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు, రైల్వే విద్యుదీకరణ మార్గానికి ప్రధాని ప్రారంభోత్సవం చేశారు.


Read More
Next Story