రామ్ కాజ్ పూర్తయింది.. రాష్ట్ర కాజ్ మిగిలి ఉంది’
x

'రామ్ కాజ్ పూర్తయింది.. రాష్ట్ర కాజ్ మిగిలి ఉంది’

భారత కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయాన్ని భూస్థాపితం చేస్తారని, అలా జరగకుండా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రధాని మోదీ ఓటర్లను అభ్యర్థించారు.


ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను మరోసారి టార్గెట్ చేశారు. భారత కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయాన్ని భూస్థాపితం చేస్తారని, అలా జరగకుండా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో శుక్రవారం (మే 17) నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

కూటమి పేకమేడలా కులుతుంది..

తమ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించబోతోందని చెబుతూ.. కొత్త ప్రభుత్వంలో పేదలు, యువత, మహిళలు, రైతుల కోసం ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. అందుకే బారాబంకి, మోహన్‌లాల్‌గంజ్ ప్రజల ఆశీర్వాదం కోసమే తాను ఇక్కడికి వచ్చానని అన్నారు.

"జూన్ 4 ఎంతో దూరంలో లేదు. మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించబోతోందని దేశం, ప్రపంచం మొత్తానికి తెలుసు. ‘అస్థిరత’ సృష్టించడానికి పోటీ చేస్తున్న భారత కూటమి ఎన్నికలు జరిగే కొద్దీ పేక మేడలా కూలిపోతుంది’’ అని అన్నారు.

"మీ పని చేసిపెట్టే ఎంపీలు మాత్రమే కావాలా? లేక మీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు కావాలా? ’’ తేల్చుకోవాలన్నారు. దీనికి మీ దగ్గర ఒకే ఒక ఆప్షన్ కమలం పార్టీని గెలిపించడమే. ఒక్కసారి ఆలోచించండి..100 సిసి ఇంజన్‌ 1000 సిసి స్పీడ్‌తో వెళ్లగలదా? మీరు, మీ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాలంటే, బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి’’ అని కోరారు.

తెరపైకి అయోధ్య రామాలయం..

భారత కూటమి పక్షాలను ఓడించడానికి మోదీ రామమందిర అంశాన్నిసభలో లేవనెత్తారు. కూటమి భాగస్వాములు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే రామమందిరాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారని పేర్కొన్నారు.

“రామ మందిరం పనికిరాదని శ్రీ రామనవమి రోజున ఎస్పీ సీనియర్ నాయకుడు అన్నారు. అదే సమయంలో రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. వారికి కుటుంబం, అధికారం మాత్రమే ముఖ్యం. ఎస్పీ-కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్ లల్లాను తిరిగి డేరాలోకి పంపుతారు. ”అని మోదీ పేర్కొన్నారు.

బుల్డోజర్లను ఎక్కడ ఉపయోగించాలో ఆదిత్యనాథ్ కు బాగా తెలుసని మోదీ అన్నారు. రాష్ట్రంలోని నేరస్తుల ఆస్తులను ఆదిత్యనాథ్ బుల్‌డోజర్‌లతో ధ్వంసం చేయించారని ఆరోపణలున్నాయి.

అఖిలేష్, మమతపై..

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై మోదీ విరుచుకుపడ్డారు. "ఇక్కడి బాబూజీ, సోషలిస్ట్ యువరాజు..ఇప్పుడు కొత్తగా అత్తను ఆశ్రయించారు. ఆమె (మమత) బెంగాల్‌లో ఉంటుంది. అత్త మాత్రం 'భారత కూటమి' నేను బయటి నుంచి మద్దతు ఇస్తానని చెబుతున్నారు" అని అన్నారు. అఖిలేష్ యాదవ్ గతంలో బీఎస్పీ అధినేత్రి మాయావతిని 'బువా' (అత్త) అని సంబోధించేవాడు.

ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మాట్లాడుతూ.. ‘‘బీహార్‌కు చెందిన దాణా కుంభకోణం ఛాంపియన్..ప్రస్తుతం అనారోగ్య కారణాలతో జైలు నుంచి బయటకు వచ్చి ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెబుతున్నాడు.’’ అని మాట్లాడారు.

' రామ్ కాజ్ పూర్తయింది.. ఇప్పుడు రాష్ట్ర కాజ్ వచ్చింది'

రాముడిని తలచుకుని.. మోదీ ఇలా అన్నారు. "రాముని పని ('రామ్ కాజ్')కి మించి, ఇప్పుడు దేశం పని ('రాష్ట్ర కాజ్')కి సమయం ఆసన్నమైంది. మీ హక్కులను కాపాడటానికి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నా’’ అని ఓటర్లను కోరారు.

(SC) లోక్‌సభ స్థానం బారాబంకిలో కాంగ్రెస్‌ అభ్యర్థి తనూజ్‌ పునియా, బీజేపీ అభ్యర్థి రాజ్‌రాణి రావత్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. తనూజ్ పునియా మాజీ లోక్‌సభ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు PL పునియా కుమారుడు. ఐదో దఫా ఎన్నికలలో భాగంగా మే 20న బారాబంకిలో పోలింగ్ జరగనుంది.

Read More
Next Story