నేనున్నంత వరకు అవేమి జరగవు: ప్రధాని మోదీ
x

నేనున్నంత వరకు అవేమి జరగవు: ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ హిందూ కార్డును వాడుతున్నారా? బరాక్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో మోదీ ఏమని ప్రసంగించారు?


పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను "రెండవ తరగతి పౌరులు"గా పరిగణిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. నార్త్ 24-పరగణాస్ జిల్లాలోని బరాక్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. సందేశ్‌ఖాలీలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారిని టీఎంసీ కాపాడుతోందని, బాధితులను టిఎంసి గూండాలు హింసించడం, బెదిరించడం మొదలు పెట్టారని ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్ లో హిందువులను భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేసిన మోదీ "జై శ్రీరాం" అని నినదించిన వారిని బెదిరిస్తున్నారని, శ్రీరామనవమి వేడుకలు జరుపుకోనివ్వడం లేదని విమర్శించారు.

మోదీ హామీలు..

ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ బెంగాల్‌ ప్రజలకు ఐదు హామీలిచ్చారు. తాను ఉన్నంత వరకు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండవని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని, రాముడిని పూజించకుండా, రామ నవమిని జరుపుకోకుండా ఎవరూ ఆపలేరని, ఎవరూ CAAని రద్దు చేయలేరని చెప్పారు.

టిఎంసి నాయకుడు హుమాయున్ కబీర్ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. టిఎంసి, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్‌ సహా భారత కూటమి భాగస్వాములు బిజెపికి వ్యతిరేకంగా "ఓటు జిహాద్"కు జై కొట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. హిందువులను భగీరథలోకి విసిరేస్తామని ఒక TMC నాయకుడు అంటున్నాడని, అలా మాట్లాడేందుకు అతనికి ధైర్యం ఇస్తున్నదెవరని మోదీ ప్రశ్నించారు.

సందేశ్‌ఖాలీ దోషులను రక్షించేందుకు టిఎంసి అన్ని విధాలా కృషి చేస్తోందని ఆరోపించారు. ‘‘సందేశ్‌ఖలీ సోదరీమణులు, తల్లులతో TMC ఏమి చేసిందో మనమందరం చూశాం. TMC గూండాలు ఇప్పుడు సందేశ్‌ఖాలీలోని మహిళలను బెదిరిస్తున్నారు. వారిని కాపాడడానికి టీఎంసీ ప్రయత్నిస్తుంది’’ అని ఆరోపించారు.

గవర్నర్ ఇటీవల తన బంగ్లాలో ఒక ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. అయితే తాను అలా ప్రవర్తించలేదని గవర్నర్ వీడియో ఫుటేజీని బయటపెట్టారు. కాగా ఆ వీడియో ఫుటేజీని మార్ఫింగ్ చేశారని టీఎంసీ చీఫ్ మమతా ఆరోపించారు. ఒరిజినల్ ఫుటేజీ తన వద్దని ఉందని చెబుతున్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ ప్రస్తావించలేదు.

షాజహాన్ షేక్, అతని సహాయకులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో పాల్గొన్న 70 మంది మహిళలకు స్థానిక బిజెపి నాయకుడు ఒక్కొక్కరికి రూ. 2,000 ఇచ్చారన్న వార్తలు వస్తున్నాయి.

Read More
Next Story